Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 2, 2021

Even if the corona winners take a single dose, the new types of virus will not reach


Vaccine: కరోనా విజేతలు ఒక్క డోసు తీసుకున్నా..వైరస్‌ కొత్త రకాలూ దరి చేరవు



 దిల్లీ: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి టీకాతో అదనపు బలం లభిస్తుందని తాజాగా మరో పరిశోధన తేల్చింది. వీరికి కరోనా వైరస్‌లో కొత్తగా వస్తున్న రకాల నుంచి కూడా రక్షణ ఉంటుందని వెల్లడించింది. అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు కొవిడ్‌ బాధితుల్లో యాంటీబాడీల ఉనికిని విశ్లేషించారు. ఆ తర్వాత కూడా వాటి తీరు తెన్నులను గమనించారు. కొంతకాలం తర్వాత రోగ నిరోధక వ్యవస్థలోని మెమరీ బి కణాలు కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా రూపాంతరం చెందాయని తేల్చారు. మెమరీ బి కణాలు.. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన రిజర్వాయర్‌లా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అందులో భిన్నరకాల యాంటీబాడీలు ఉంటున్నాయన్నారు. ఫలితంగా వైరస్‌ నుంచి మెరుగైన, దీర్ఘకాల రక్షణ క్రమంగా వృద్ధి చెందుతున్నట్లు వివరించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు కనీసం ఒక డోసు టీకా పొందితే.. వారిలో ఈ యాంటీబాడీలు మరింత పెరిగాయని చెప్పారు. వీరికి బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూయార్క్‌లలో మొదట వెలుగు చూసిన కరోనా వైరస్‌ రకాల నుంచి రక్షణ లభిస్తోందని తెలిపారు.

Thanks for reading Even if the corona winners take a single dose, the new types of virus will not reach

No comments:

Post a Comment