ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్
విజయవాడ: ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్.. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సీఎం జగన్ అన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు.
ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
●దిశ యాప్ ను ఎలా వాడాలి.. దీని ప్రత్యేకతలు ఏంటి..?
https://www.tlmweb.in/2020/02/disha-app-disha-is-step-towards-safety.html
Thanks for reading Disha SOS services helps the women and citizens in emergency situation.
No comments:
Post a Comment