Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 28, 2021

Scams with whatsapp DP like sending money urgently


 WhatsApp డీపీతో గాలం..నయా మాయజాలం

●సన్నిహితుల ప్రొఫైల్‌ ఫొటోలతో సందేశాలు

●అత్యవసరంగా డబ్బు పంపాలంటూ మోసాలు

●అమెరికా కేంద్రంగా సైబర్‌ నేరస్థుల దందా

●సొమ్ము పంపించే ముందు ధ్రువీకరించుకోవాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ బోయిన్‌పల్లికి చెందిన దిలీప్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి న్యూయార్క్‌లో ఉంటున్న స్నేహితుడు రమేశ్‌ ప్రొఫైల్‌ ఫొటో ఉన్న వాట్సప్‌ నంబర్‌ నుంచి నాలుగు రోజుల క్రితం ‘హాయ్‌’ అంటూ సందేశం వచ్చింది. కొద్దిసేపటికే.. ‘మా చిన్నాన్న కొవిడ్‌తో ఆసుపత్రిలో ఉన్నాడు. రూ.2 లక్షలు అత్యవసరం. డబ్బు పంపితే మరుసటి రోజు జమ చేస్తా’ అంటూ మెసేజ్‌ వచ్చింది. అందుకు దిలీప్‌ అంగీకరించడంతో నగదు జమ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించాడు. అందులోకి దిలీప్‌ రూ.1.98 లక్షలు పంపించాడు. కొద్దిగంటల తర్వాత రమేశ్‌కు ఫోన్‌ చేయగా.. తాను ఎలాంటి మెసేజ్‌ పంపించలేదని, ఆ వాట్సప్‌ నంబర్‌ తనది కాదని చెప్పాడు. మోసపోయానని గుర్తించిన దిలీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమెరికాలో ఉంటున్న మీ స్నేహితులు, సన్నిహితుల ప్రొఫైల్‌ ఫొటో(డీపీ) ఉన్న నంబర్‌ నుంచి వాట్సప్‌లో అత్యవసరంగా డబ్బు కావాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయా? తాము చెప్పిన ఖాతాలో నగదు జమ చేయాలంటూ కోరుతున్నారా? అమెరికా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు పాల్పడుతున్న సరికొత్త మోసమిది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సప్‌ నంబర్లకు ఇలాంటి అభ్యర్థనలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని, మరో ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని మోసం చేసి రూ.3.8 లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ మోసాల నేపథ్యంలో డబ్బులు కావాలంటూ వాట్సప్‌ ద్వారా ఎవరు అభ్యర్థించినా.. నేరుగా ఫోన్‌ చేసి ధ్రువీకరించుకోవాలని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తున్నారు..

అమెరికాలో ఉంటున్న వ్యక్తుల వాట్సప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను సైబర్‌ నేరస్థులు సంపాదిస్తున్నారు. వారి కాంటాక్టు జాబితాలో ఉన్న 40-50 మందికి వాట్సప్‌ సందేశాలు పంపుతున్నారు. తన స్నేహితుడు లేదా బంధువు ఆసుపత్రిలో ఉన్నాడని, తనకు డబ్బు పంపాలంటే సమయం సరిపోదని.. బ్యాంక్‌ ఖాతాకు సొమ్ము బదిలీ చేసి సాయం చేయాలని కోరుతున్నారు. సందేశాలు అందుకున్నవారు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు. కేవలం చాటింగ్‌ మాత్రమే చేస్తున్నారు. తాను అత్యవసర పనుల్లో ఉన్నానని, తర్వాత మాట్లాడతానని దాటవేస్తున్నారు. అది నిజమేననుకుని నమ్మినవారు సైబర్‌ నేరస్థులు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఆ డబ్బు ఎప్పుడు తిరిగిస్తారో తెలుసుకునేందుకు ఒకటి, రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసినప్పుడు అసలు విషయం బయటపడుతోంది.

ఇలా చేస్తే సురక్షితం

వాట్సప్‌ ప్రొఫైల్‌ ఫొటోల ద్వారా సైబర్‌ నేరస్థులు ఎలా మోసం చేస్తున్నారన్నది పోలీసులకూ అంతుచిక్కడం లేదు. ఫొటోలను ఎలాగోలా సేకరించినా... ఆ వ్యక్తి స్నేహితులు, సన్నిహితుల వివరాలు ఎలా తెలుసుకుంటున్నారన్నదానిపై స్పష్టత లేదు. మోసాలను తప్పించుకునేందుకు వాట్సప్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

వాట్సప్‌లోని సెట్టింగ్‌ మెనూలో ‘అకౌంట్‌’ అన్న ఐచ్ఛికం ఉంటుంది. దాన్ని తెరవగానే.. ‘ప్రైవసీ’ అన్న మరో ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. అందులో ‘ప్రొఫైల్‌ ఫొటో’ ఉన్నచోట క్లిక్‌ చేయాలి. అందులో ప్రతి ఒక్కరికీ, కేవలం నా కాంటాక్ట్‌ నంబర్లకే, ఎవరికీ వద్దు అని మూడు ఐచ్ఛికాలు ఉంటాయి. ‘ఎవరికీ వద్దు’ను ఎంచుకుంటే మీ ఫొటో వాట్సప్‌లో ఎవరికీ కనిపించదు. ‘కాంటాక్ట్‌ నంబర్లకే’ను ఎంచుకుంటే ఫోన్లో నంబర్లు ఉన్నవారికే కనిపిస్తుంది

Thanks for reading Scams with whatsapp DP like sending money urgently

No comments:

Post a Comment