TS Inter Result 2021 Declared ... Check How to Download Marks Memo
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు.. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్ -ఏ 61,887 మంది గ్రేడ్ -బి సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది.ఫలితాలను http://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మార్కుల మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ 040 24600110కు ఫోన్ చేసి చెప్పాలని సూచించింది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Second Year Student Check Slip IPE 2021
Thanks for reading TS Inter Result 2021 Declared .
No comments:
Post a Comment