పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా?
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు 3 నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను యూనివర్సల్ అకౌంట్ నెంబరు(యుఎఎన్)లో సులభంగా అప్ డేట్ చేయవచ్చు. మీరు బ్యాంక్ ఖాతా వివరాలను పీఎఫ్ ఖాతాలో అప్ డేట్ చేయడం ద్వారా భవిష్యత్ లో ఎప్పుడైన నగదు ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పుడు మీ ప్రాసెస్ అప్పుడు తేలిక అవుతుంది. "ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను యుఎఎన్లో సులభంగా ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకోండి" అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.
Know the simple steps through which employees can easily update their Bank Account Details in UAN. #EPFO #SocialSecurity #HumHainNa #Employees #Services #पीएफ #ईपीएफओ pic.twitter.com/3xyM0deMAY
Know the simple steps through which employees can easily update their Bank Account Details in UAN. #EPFO #SocialSecurity #HumHainNa #Employees #Services #पीएफ #ईपीएफओ pic.twitter.com/3xyM0deMAY
— EPFO (@socialepfo) June 24, 2021
పీఎఫ్ ఖాతాలో బ్యాంకు ఖాతా వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి?
మీరు "యూనిఫైడ్ మెంబర్ పోర్టల్"లో "యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్"తో లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు 'మ్యానేజ్ ట్యాబ్'పై క్లిక్ చేస్తే "డ్రాప్ డౌన్ మెనూ"లో ఉన్న 'కెవైసీ'ను ఎంచుకోవాలి.
తర్వాత అందులో మీకు కనిపించే బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేసి ఆ తర్వాత 'సేవ్' మీద క్లిక్ చేయండి.
కొత్త బ్యాంకు వివరాలను సేవ్ చేసిన తర్వాత ఇది 'ఆమోదం కొరకు కెవైసి పెండింగ్ లో ఉంది' అని చూపిస్తుంది. బ్యాంకు వివరాలు ఆమోదం పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి మీకు ఒక సందేశం వస్తుంది సంస్థ తెలిపింది.
Thanks for reading How to update bank account details in PF account?
No comments:
Post a Comment