Phone Theft: కంగారొద్దు.. కిటుకులు ఇవిగో..
వ్యక్తిగత సమాచారం నుంచి సోషల్ మీడియా.. బ్యాంకు లావాదేవీల వరకు స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడటం అలవాటైంది. ఈ మధ్య దొంగలు, సైబర్ కేటుగాళ్లు తెలివిమీరిపోయారు. మొబైల్‌ను తస్కరించి అందులోని పర్సనల్ డేటా, బ్యాంకింగ్ వివరాలను తెలుసుకుని నగదు గుంజేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ చోరీ కాగానే వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్ కాపీని తీసుకుని బ్యాంకు, వ్యాలెట్ల ప్రతినిధులను కలుసుకోవాలి. పోలీసులు మీ ఫోన్‌ను వెతికిపట్టుకునేలోగా సైబర్ నేరగాళ్ల చేతివాటం నుంచి బయట పడాలంటే చిన్నపాటి చిట్కాలను పాటిస్తే చాలు.. అవేంటో తెలుసుకుందాం..
సిమ్ కార్డు బ్లాక్.. బ్యాంకింగ్ సేవలు నిలిపివేత
* స్మార్ట్‌ఫోన్ చోరీకి గురికాగానే వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించండి
* ఒకవేళ ఫినాన్స్ సర్వీసులు, వ్యక్తిగత సందేశాలు రాకుండా సిమ్ కార్డును బ్లాక్ చేయడం ఉత్తమం
* ఆ సిమ్ కార్డును బ్లాక్ చేయించినా.. అదే నెంబర్ మీద మరొక సిమ్‌ను తీసుకోవచ్చు
* అయితే కొత్త సిమ్ వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ఆలోపు సైబర్ నేరగాళ్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చూసేందుకు సిమ్ బ్లాక్ చేయడం ఉపయోగపడుతుంది
* వెంటనే బ్యాంక్‌కు కాల్ చేసి బ్యాంకింగ్ సేవలను నిలిపి వేయాలని కోరండి
* కొన్నింటికి ఓటీపీ రాకపోయినా లావాదేవీలు జరిపేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలి
* బ్యాంక్ అధికారిని సంప్రదించాలి. లావాదేవీలకు సంబంధించి మొబైల్ నెంబర్‌ను మార్చుకోండి.
* అలానే పాస్‌వర్డ్‌లను మార్చుకుని మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ప్రారంభించాలి
ఆధార్.. యూపీఐ.. వ్యాలెట్లు.. సోషల్ మీడియా
* యూపీఐ, వ్యాలెట్లు లేని స్మార్ట్‌ఫోన్లు ఉండవు. మరి స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు వ్యాలెట్ల యాక్సెస్‌ను బ్లాక్ చేయండి
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను బ్లాక్ చేసిన తర్వాత యూపీఐ ఖాతానూ డీయాక్టివేట్ చేయాలి
* అలానే స్మార్ట్‌ఫోన్ చోరీకి గురైనప్పుడు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను ఛేంజ్ చేసుకోవాలి
* ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు
* ఫోన్ చోరీకి గురి కాగానే సామాజిక మాధ్యమాలకు అనుసంధానమైన ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలి
* దీని వల్ల మీ ఖాతాల నుంచి సన్నిహితులకు, బంధువులకు తప్పుడు సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవచ్చు
Thanks for reading Phone Theft: If you want to protect yourself from cyber criminals, just follow these simple tips.
No comments:
Post a Comment