Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 30, 2021

whatsApp: Can only be viewed once ..


 WhatsApp: ఒక్కసారి మాత్రమే చూడగలరు..  

 ప్రైవసీకి పెద్ద పీట వేస్తాం అంటూ వాట్సాప్‌ చాలా రోజులుగా చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘వ్యూ వన్స్‌’ పేరుతో ప్రైవసీ-ఫ్రెండ్లీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చారు. త్వరలో అందరికీ ఈ సదుపాయం తీసుకొస్తారు. ఈ ఫీచర్‌ ఏంటి, ఎలా పని చేస్తుందంటే? 

* ఏదైనా ఫొటో/వీడియో/గిఫ్‌లను వాట్సాప్‌లో ఇతరులకు పంపితే, అవతలి వ్యక్తి వాటిని కేవలం ఒక్కసారే చూసేలా చేయటమే ఈ ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ ఉపయోగం. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకుంటే...  రిసీవర్‌ ఛాట్‌ స్క్రీన్‌ నుంచే కాకుండా, పంపినవారి ఛాట్ స్క్రీన్‌ నుంచి కూడా పూర్తిగా డిలీట్‌ అయిపోతుంది. ఆ మాటకొస్తే సెండ్‌ బటన్‌ క్లిక్‌ చేశాక ... పంపినవారికి కూడా ప్రివ్యూ కనిపించదు. అయితే ప్రతిసారి ఫొటోలు/వీడియోలు పంపినప్పుడు ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. (ఎనేబుల్‌ కోసం క్లిక్‌ చేయాల్సిన బటన్‌ పైన ఇమేజ్‌లో రౌండ్‌ చేసి ఉంది)



* గ్రూప్‌ ఛాట్‌లలోనూ  ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. గ్రూపు సభ్యులు అందరూ చూసేంతవరకు ఆ ఇమేజ్‌ స్టేటస్‌ (ఇన్ఫోలో కనిపించేది) మారదు. అందరూ చూశాకనే ‘వన్స్‌ వ్యూ’ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకున్న ఇమేజ్‌ డిస్‌పియర్‌ అవుతుంది. అలాగే ఆ ఫొటో/వీడియోలను గ్రూపులో ఎవరెవరు చూశారనేది మెసేజ్‌ ఇన్ఫో సెక్షన్‌లో తెలుస్తుంది. గ్రూప్‌ సభ్యుల్లో మీరు గతంలో బ్లాక్‌ చేసిన వ్యక్తులు కూడా... వ్యూ వన్స్‌ ఫీచర్ ద్వారా పంపిన ఫొటో/వీడియోలను చూడొచ్చు.


* ఇప్పటికే ఇన్‌స్టాగ్రాంలో ఎక్స్‌పైరింగ్ మీడియా, సిగ్నల్‌లో ఎక్స్‌పైరింగ్ మీడియా మెసేజెస్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో సీక్రెట్‌ మెసేజింగ్‌ పేరుతో ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Thanks for reading whatsApp: Can only be viewed once ..

No comments:

Post a Comment