Home loan: రిజక్ట్ అయ్యిందా? ఇవి కూడా కారణాలు కావచ్చు.
రుణం ఆమోదించేందుకు రుణదాతలు ప్రధానంగా రెండు విషయాలను చూస్తారు. ఒకటి క్రెడిట్ స్కోరు, చరిత్ర రెండు ఆదాయం. రుణాలు మంజూరు చేసేందుకు ప్రతీ బ్యాంకుకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. బ్యాంకుల కావలసిన కనీస అర్హతలు ఉన్న వారికే రుణాన్ని ఆమోదిస్తాయి. లేదంటే దరఖాస్తును తిరస్కరిస్తారు.
రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి స్థిరమైన ఆదాయం ఉందా.. అనే అంశాన్ని ముందుగా పరిశీలిస్తాయి బ్యాంకులు. దీంతో పాటు వ్యక్తి వయసు, నివాసం, విద్యార్హతలు వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తులో తప్పులు.. అంటే పేరు, వయస్సు, చిరునామా వంటివి లోన్ అప్లికేషన్‌లో తప్పుగా ఎంటర్‌చేస్తే.. బ్యాంకులు, దరఖాస్తుదారుని గురించి కావలసిన సమాచారాన్ని సేకరించడం కష్టం అవుతుంది. దీంతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంటుంది.
రుణ దరఖాస్తు తిరస్కరించడానికి గల కారణాలు..
వయసు, సర్వీసు ఉన్న కాలం, ఈఎమ్ఐ..
రుణం తిరిగి చెల్లించే కాలవ్యవధి కూడా రుణ అర్హతను నిర్ణయిస్తుంది. మీరు వయసులో చిన్నవారై ఉండి.. రుణం తిరిగి చెల్లింపులకు ఎక్కువ కాలవ్యవధి ఉంటే.. తక్కువ ఈఎమ్ఐతో రుణం తీర్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. అదే మీ వయసులో పెద్ద వారైయుండి.. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారైతే రుణం తీర్చేందుకు తక్కువ కాలవ్యవధి ఉంటుంది. ఈఎమ్ఐ పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఆదాయంలో నిర్థిష్ట శాతం వరకు మాత్రమే ఈఎమ్ఐ ఉండాలని పరిమితి విధిస్తాయి రుణసంస్థలు. సాధారణంగా నెలవారి ఆదాయంలో 50శాతం లోపల ఈఎమ్ఐ ఉండాలి. అంతకు మించి ఎఈమ్ఐ చెల్లించాల్సి వస్తే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.
ఆస్తి విలువ తక్కువుంటే..
బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 85శాతం వరకు రుణంగా అందిస్తాయి. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా.. భవనం వయస్సు, ఇల్లు ఉన్న ప్రదేశం, నిర్మాణ విలువలు, ప్రస్తుతం ఉన్న స్థితి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆస్తి విలువను అంచనా వేస్తాయి బ్యాంకులు. ఆదాయం ఆధారంగా అధిక రుణం తీసుకునేందుకు మీకు అర్హత ఉన్నప్పటికీ.. ఆస్తి విలువ తక్కువగా ఉంటే రుణ దరకాస్తును తిరస్కరించవచ్చు.
అనుమతులు లేని ఆస్తి లేదా బిల్డర్..
ఆస్తి స్థానిక సంస్థలచే ఆమోదించబడిందో.. లేదో రుణదాతలు తనిఖీ చేస్తారు. స్థానిక అధికారులు సూచించిన నిర్దిష్ట మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకపోతే, రుణాన్ని తిరస్కరించవచ్చు. అదేవిధంగా, బిల్డర్లకు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసే ముందు బ్యాంకుల వాటిని పూర్తిగా పరిశీలిస్తాయి. మీరు బిల్డర్ వద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే.. బ్యాంకు ఆమోదం లేని లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బిల్డర్ వద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు.. ఆస్తి విలువ, ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దరఖాస్తు రిజక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఆస్తి వయసు..
కొనుగోలు చేసిన ఇంటిని హామీగా పెట్టుకుని రుణం ఇస్తారు. ఒకవేళ ఆస్తి పాతది అయితే, చట్టపరమైన, సాంకేతిక అంశాలతో పాటు నిర్మాణ పతన సంభావ్యతను కూడా అంచనా వేస్తాయి. కొన్ని సందర్భాల్లో అంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తి పాతదైనప్పుడు లేదా కూల్చివేత దశకు చేరుకున్న ఆస్తి కొనుగోలుకు చేసే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
Thanks for reading Home loan rejected? These can also be causes.
No comments:
Post a Comment