Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 25, 2021

WhatsApp Shortcut Tips


 WhatsApp Shortcut Tips: వాట్సాప్ షార్ట్‌కట్స్ గురించి తెలుసా? 

 వర్క్‌ ఫ్రం హోం విధానం ఎక్కువైన తర్వాత వాట్సాప్‌ వినియోగం బాగా పెరిగింది. ఆఫీస్‌ వర్క్‌ కోసం డెస్క్‌టాప్‌లో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకోవడంతోపాటు ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఓ భాగం చేసుకుంటూ ఉంటాం. అయితే మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేస్తుంటారు. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను వాడొచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. 


1️⃣ మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌: ఏదైనా గ్రూప్‌లో మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తాం. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూశామని తెలుస్తుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడలేదని తెలిసేలా ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి వెళ్తుంది. 


2️⃣ ఆర్కివ్‌ చాట్‌: సాధారణంగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌నుకానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సింపుల్‌గా ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోద్ది.  


3️⃣ పిన్‌ చాట్‌: ముఖ్యమైన గ్రూప్‌ను టాప్‌లో పెట్టుకునేందుకు పిన్‌ చాట్‌ ఉపయోగపడుతుంది. దీని కోసం ctrl+alt+shift+p


4️⃣ సెర్చ్‌ చాట్‌: గ్రూప్‌లోని చాటింగ్ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడానికి ctrl+alt+shift+f క్లిక్‌ చేయాలి.


5️⃣ న్యూ గ్రూప్‌, న్యూ చాట్: కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవడానికి ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. న్యూ చాట్‌  కోసం  ctrl+alt+N ప్రెస్ చేయాలి.


6️⃣ ఇన్‌క్రీజ్ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆఫ్‌ సెలెక్టెడ్‌ వాయిస్ మెసేజ్‌: మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి shift+. ఉపయోగపడుతుంది.


7️⃣ సెట్టింగ్స్‌: వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలంటే మెను క్లిక్‌ చేసి అందులోని సెట్టింగ్స్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.


8️⃣ మ్యూట్‌: ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే ctrl+alt+shift+M వాడుకోవచ్చు.


9️⃣ ఎగ్జిట్‌ గ్రూప్: ఏదైనా గ్రూప్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలంటే.. సాధారణంగా గ్రూప్‌లోని త్రీడాట్స్‌ను క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి బదులు ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.


🔟 ప్రొఫైల్ అండ్‌ ఎబౌట్‌: యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు ctrl+alt+P క్లిక్‌ చేసేయండి.

Thanks for reading WhatsApp Shortcut Tips

No comments:

Post a Comment