AP : టెన్త్ పాసైన విద్యార్థులకు SSC బోర్డు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇస్తోంది.
★ ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని..
★ పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన వారికి మైగ్రేషన్ సర్టిఫికెట్ను పాఠశాల లాగిన్ పొందుపరిచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ. సుబ్బారెడ్డి తెలిపారు.
★ ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ ఏపీలో 2020-21 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఫలితాలను ఈ నెల 6న విడుదల చేసినట్లు తెలిపారు.
★ రుసుము చెల్లించిన వారికి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మైగ్రేషన్ సర్టిఫికెట్లు అందజేయాలని ఆదేశించారు.
★ ఈ అవకాశం వచ్చే నెల 5వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
★ తదుపరి మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే మరో రూ.80 రుసుము చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరేటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
★ ఈ ఏడాది విద్యార్థులే కాక పూర్వపు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగానికి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిపించినట్లు తెలిపారు.
★ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైట్లో మైగ్రేషన్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
★ దరఖాస్తు తదితర వివరాలతో కూడిన వీడియో, పవర్పాయింట్ ప్రజెంటేషన్ ను తొందరలోనే వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
Thanks for reading AP: The SSC Board is issuing migration certificates to students who have passed the 10th
No comments:
Post a Comment