Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 10, 2021

Voter Enrollment: Is your name on the voters' list? Apply!


 Voter Enrollment: ఓటర్ల జాబితాలో మీ పేరు లేదా?దరఖాస్తు చేసుకోండి!

ఓటరు నమోదుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ

అమరావతి: కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కె.విజయానంద్‌  ప్రకటన విడుదల చేశారు.


అక్టోబరు 31వ తేదీ వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. 2021 నవంబర్‌ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. నవంబరు 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో తెలిపారు. నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆయా తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని సీఈవో స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలతో పాటు http://www.nvsp.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు, మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తామని సీఈవో పేర్కొన్నారు.

Thanks for reading Voter Enrollment: Is your name on the voters' list? Apply!

No comments:

Post a Comment