Highlights of the AP Cabinet meeting @ 06.08.21

పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం: పేర్నినాని
అమరావతి: నాడు- నేడు కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీ వివరాలను మంత్రి నాని మీడియాకు వివరించారు. తొలివిడతగా 15 వేలకుపైగా పాఠశాలలను అభివృద్ధి చేశామని, బడుల్లో దశల వారీ పనులకు రూ.21 వేల కోట్లు చెల్లించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని అన్నారు. 34 వేల బడుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతోందన్నారు.
నాణ్యమైన విద్యా బోధనపై ప్రభుత్వం సర్వే నిర్వహించిందని, చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నారని చెప్పారు. అందరికీ ఒకే టీచర్ ఉండటం వల్ల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రాథమిక దశలోనే మంచి చదువు అందేలా విప్లవాత్మక చర్యలు చేపట్టామని, తెలుగు, ఆంగ్లంలో ఒకేసారి బోధన జరిగేలా చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ అని మంత్రి వివరించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ప్రాథమిక దశలోనే మెరుగైన విద్య అందించేలా చర్యలు
34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన వసతులు
ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉంటుంది
నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి
శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ PP1 పేరుతో అంగన్వాడీ స్కూళ్లలో విద్య నేర్పాలి
ఫౌండేషన్ స్కూల్స్‌లో PP1, PP2, 1, 2 తరగతులకు పాఠాలు
హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం
2020-21 సంవత్సరానికి నేతన్న నేస్తం పథకం అమలుచేయాలని నిర్ణయం
ఈ నెల 24న 10 వేల నుండి 20 వేల డిపాజిట్ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు
అభ్యంతరంలేని 300 చదరపు గజాల వరకు రేగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయం
అక్టోబర్ 15, 2019 నాటికి ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారికి ఇది వర్తింపు
అసైన్డ్ ఇంటి స్థలాన్ని అమ్ముకునే అవకాశాన్ని.. 20 ఏళ్ల నుండి 10 ఏళ్లకు తగ్గిస్తూ కాబినెట్‌లో నిర్ణయం
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 06.08.21
No comments:
Post a Comment