Covid Vaccine : రెండు డోసులు.. వైరస్ బారిన పడే ప్రమాదం మూడు రెట్లు తక్కువ
లండన్ : కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మనముందున్న మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారు వైరస్ బారిన పడే ప్రమాదం మూడు రెట్లు తక్కువ అని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.
బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ విశ్వవిద్యాలయం, ఇప్సొస్ మోరి కంపెనీ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. జూన్ 24 నుంచి జులై 12 మధ్య 98 వేల మందికిపైగా వాలంటీర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. వ్యాక్సిన్ వేయించుకోనివారితో పోలిస్తే.. రెండు డోసులు తీసుకున్నవారు కొవిడ్ బారిన పడే ముప్పు మూడు రెట్లు తక్కువగా ఉంటుందని ఇందులో తేలింది. ఇక టీకా రెండు డోసులు తీసుకున్న వారికి వైరస్ సోకినా.. వారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది.
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఈ అధ్యయనం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని యూకే వ్యాక్సిన్ మంత్రి నదీమ్ అన్నారు. ‘మన టీకా కార్యక్రమం మహమ్మారి నుంచి రక్షణ గోడను నిర్మిస్తోంది.. అంటే మనం ఆంక్షలను క్రమంగా తొలగించవచ్చు. అయితే మనం వైరస్‌తో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఆ దేశ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ పేర్కొన్నారు. బ్రిటన్‌లో అందుబాటులో ఉన్న ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని కరోనా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
Thanks for reading Covid Vaccine: Two doses...The risk of contracting the virus is three times lower
No comments:
Post a Comment