Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 5, 2021

Minimum passing marks for Intermediate 1st year students


ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు..      విద్యార్థులు , వారి తల్లిదండ్రుల సందేహాలకు ప్రకటన విడుదల చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి..

 అమరావతి : కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కు లు ( మినిమం పాస్ మార్కులు ) తో సెకండియర్ ( 2021-22 ) లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్మీడి యెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు . ఇటీవల ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు , వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవు తున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు . 

రెగ్యులర్ సెకండియర్ ( 2020-210 ) పూర్తి చేసిన విద్యార్థులకు ... 

● ఐపీఈ మార్చి 2021 కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు .. వారి మార్కులు ( ఫస్టియర్ , సెకం డియర్ ) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు . 

● ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు . 

●ఐపీఈ - మార్చి 2021 / అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు . 

●ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు .

 ●హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థు లు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరు కావాలి . .

●విద్యార్థులంతా నైతిక విలువలు ( ఎథిక్స్ ) , మానవ  ( హ్యూమన్ వ్యాల్యూస్ ) , పర్యావరణ విద్య ( ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకే షన్ పరీక్షల్లో ) క్వాలిఫై అవ్వాలి . అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి . 

●ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పిన , గైర్హాజరు అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికలకు హాజరు కావాల్సి ఉంటుంది .

రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు .. 

◆ 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఐపీఈ - మార్చి 2021 పరీ క్షలకు ఫీజు చెల్లించిన వారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్ లోకి ప్రమోషన్ 

◆ కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు . ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవ సరం లేదు .

◆ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు . 

◆ ఐపీఈ -2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్ సప్లి మెంటరీ పరీక్షలకు హాజరుకావాలి .

Schedule for Supplementary Exams Here

Thanks for reading Minimum passing marks for Intermediate 1st year students

No comments:

Post a Comment