Locate Smartphone : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా ? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి
జేబులో ఉండాల్సిన స్మార్ట్‌ఫోన్ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టవుతుంది. స్మార్ట్‌ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా దొరకడం కష్టం అనుకుంటారు.
కానీ ముందే కాస్త జాగ్రత్తపడితే స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవడం సులువు అవుతుంది. ఇందుకోసం మీరు ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ఉపయోగించుకోవాలి. ఫైండ్ మై ఫీచర్ ఫీచర్‌ను సమర్థవంతంగా ఉపయోగించాలంటే మీరు తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లొకేషన్ సర్వీసెస్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి. గూగుల్ అకౌంట్ లాగిన్ కావాలి. ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు, దొంగిలించినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినా లొకేట్ చేయడానికి ఈ స్టెటింగ్స్ ఉపయోగపడతాయి.
సాధారణంగా ప్రతీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అయ్యే ఉంటుంది. మీరు ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెక్యూరిటీ సెక్షన్‌లో ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ఓపెన్ చేయాలి. ఒకవేళ ఈ ఫీచర్ ఆఫ్‌లో ఉంటే ఆన్ చేయాలి. లొకేషన్ ఆన్‌లో ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఆఫ్‌లో ఉంటే లొకేషన్ సర్వీసెస్ ఆన్ చేయాలి. ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ను లొకేట్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కనిపించకుండా పోయినా, ఎవరైనా దొంగిలించినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా ఎలా లొకేట్ చేయాలో తెలుసుకోండి.
వేరే స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో గూగుల్ సెర్చ్ పేజ్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైజ్ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మ్యాప్‌లో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. PLAY SOUND, SECURE DEVICE, ERASE DEVICE మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ మీకు దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తే PLAY SOUND క్లిక్ చేయాలి. ఇంట్లో లేదా ఆఫీసులో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే లొకేట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ లొకేషన్ మీకు దూరంగా కనిపిస్తే SECURE DEVICE పైన క్లిక్ చేసి మెసేజ్, మీ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ దొరికినవాళ్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.
ఈ ఆప్షన్స్ ఉపయోగించినా మీ స్మార్ట్‌ఫోన్ దొరకడం కష్టం అని భావిస్తే అందులోని కీలకమైన డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ERASE DEVICE ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మీ డేటా మొత్తం డిలిట్ అవుతుంది.
Thanks for reading Locate Smartphone: Lost your smartphone? Find out where it is
No comments:
Post a Comment