Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 9, 2021

RRB Group D Jobs.


 RRB Group D Jobs : త్వరలో జరగబోవు 1,03,769 రైల్వే జాబ్స్ ఎగ్జామ్స్ కు ... ఏం చదవాలంటే..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఓ నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వేలో 1,03,769 పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2019లో విడుదలైంది. ఇంకా పరీక్షలు జరగలేదు. కరోనా వైరస్ మహమమారి కారణంగా ఈ పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో త్వరలోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. త్వరలోనే( డిసెంబర్ 2021 కావచ్చు) గ్రూప్ డీ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దీంతో దేశవ్యాప్తంగా కోటి 15 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లై చేశారు.

మరి ఈ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో దశలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, నాలుగో దశలో మెడికల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 నిమిషాలు. 1/3 నెగిటీవ్ మార్కింగ్ ఉంటుంది. మూడు తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గుతుంది. ఈ పరీక్షలో క్వాలిఫై కావాలంటే అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులు 40 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులు 30 శాతం, ఎస్‌సీ అభ్యర్థులు 30 శాతం, ఎస్‌టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.మ్యాథమెటిక్స్‌లో నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టెర్న్ టాపిక్స్‌పైన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.


జనరల్ సైన్స్‌లో సీబీఎస్ఈ 10వ తరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సిలబస్ కవర్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనమిక్స్, పాలిటిక్స్‌లో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది.

Thanks for reading RRB Group D Jobs.

No comments:

Post a Comment