వ్యాక్సిన్ వేసుకున్న , వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే .. !
టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా కరోనా సోకుతోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లో లక్షణాలు వేరువేరుగా ఉంటున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మళ్లీ ముప్పుతిప్పలు పెడుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్(delta variant covid).. అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతోంది. టీకా పొందిన వారిలోనూ వైరస్ లక్షణాలు బయటపడటం ఆందోళనకరంగా మారింది. అయితే టీకా తీసుకోవడమే మేలు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సోకినా.. తీవ్రత తక్కువ ఉంటుందని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో, వ్యాక్సినేషన్ పాక్షికంగా అయిన వారిలో, అసలు టీకా తీసుకోని వారిలో వైరస్ లక్షణాలు, తీవ్రత ఎలా ఉందనే అంశంపై అమెరికా సీడీసీ(రోగ నిరోధన నివారణ కేంద్రం) వివిధ కేసులపై పరిశోధనలు చేసి వివరణ ఇచ్చింది.
టీకాతో రక్ష..
ఫైజర్ టీకా తీసుకుంటే డెల్టా వేరియంట్(delta variant covid vaccine) ముప్పు 88శాతం తగ్గుతుందని ఇంగ్లాండ్‌లో జరిగిన పరిశోధనల్లో తేలింది. డెల్టాలోని ఇతర రకాలు సోకకుండా ఈ టీకా 79శాతం అడ్డుకుంటుందని రుజువైంది. అలాగే మిగతా టీకాలు వైరస్‌పై సమర్థవంతగా పని చేస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మొత్తం మీద టీకాల కారణంగా ఆస్పత్రుల్లో చేరే ప్రమాదం, మరణించే వారి సంఖ్య 25రెట్లు తగ్గిందని అమెరికా సీడీసీ పేర్కొంది. అయితే దీర్ఘకాల కొవిడ్‌తో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
అందువల్ల టీకాలు తీసుకున్న వారికి, తీసుకోని వారికి మధ్య వ్యాధి తీవ్రత చాలా కీలకంగా మారింది. టీకా పొందిన వారిలో లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉండగా, అసలు ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని వారిని వైరస్ చాలా సార్లు ముప్పుతిప్పలు పెడుతోంది. పాక్షికంగా టీకా వేసుకున్నా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువేనని పరిశోధకులు పేర్కొన్నారు.
Thanks for reading These are the symptoms of corona in those who have been vaccinated and those who have not.
No comments:
Post a Comment