SBI Home Loan: హోం లోన్ తీసుకుంటారా? మరి ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది!
భారతీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై ఆగస్టు చివరి వరకు ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు రేపటితో ముగియనుంది.
మాన్‌సూన్ ధమకా ఆఫర్ కింద పరిమిత కాలం వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను నూరు శాతం రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ గత నెలలో ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 0.40 శాతంగా ఉన్న ప్రాసెసింగ్ ఫీజు భారం వినియోగదారులకు తగ్గింది. అయితే ఈ ఆఫర్ ఆగష్టు 31 వరకు మాత్రమే ఉన్నందున.. రేపటితో గడువు ముగియనుంది.
అంతేకాకుండా యోనో యాప్ ద్వారా గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆఫర్ కింద 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) అదనపు వడ్డీ రాయితీని కూడా ఎస్‌బీఐ అందిస్తుంది. మహిళలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ప్రకటించింది. ఎస్‌బీఐ గృహరుణం ప్రస్తుత ప్రారంభ వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది.
ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, వినియోగదారులు, ఉద్యోగుల పరంగా దేశీయ అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్‌బీఐ. బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 30 లక్షల భారతీయ కుటుంబాలు ఇంటి కొనుగోలుకు రుణం పొందాయి. బ్యాంక్ గృహరుణ పోర్ట్‌ఫోలియో రూ.5లక్షల కోట్ల మైలురాయిని దాటింది. మార్కెట్‌లో గృహ రుణాల విభాగంలో 34.77 శాతం, వాహన రుణాల విభాగంలో 31.11 శాతం వాటా ఎస్‌బీఐదే.
Thanks for reading SBI Home Loan
No comments:
Post a Comment