SBI Rakshabandhan Offer: ఎస్‌బీఐ రక్షాబంధన్ డిస్కౌంట్లు!
దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ప్రారంభమైంది. దీంతో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
* ‘ఫెర్న్స్ అండ్ పెటల్స్’లో బహుమతులు కొనుగోలు చేసేవారు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేస్తే 20 శాతం కచ్చితమైన రాయితీ లభించనుంది. ఎంత కనీస మొత్తానికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.999 వరకు రాయితీ పొందొచ్చు. ‘ఎస్‌బీఐ20’ అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్ ఆగస్టు 22 వరకు అందుబాటులో ఉండనుంది.
* ఇక గిఫ్టింగ్ పోర్టల్ ఐజీపీ.కామ్‌లో బహుమతులు కొనుగోలు చేసేవారికి ఎస్‌బీఐ సాధనాల ద్వారా చెల్లింపులు చేస్తే 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా చెల్లిస్తే అదనంగా మరో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. దీనికి ‘ఐజీపీఎస్‌బీఐ’ అనే కూపన్ కోడ్ వినియోగించాలి. ఈ ఆఫర్ కూడా 22 ఆగస్టు వరకు అందుబాటులో ఉండనుంది.
Thanks for reading SBI Rakshabandhan Offer
No comments:
Post a Comment