ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్‌పీ సిసోడియాను నియమించారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్‌గా నారాయణ్‌ను నియమిస్తూ.. డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్‌గా ఉన్న పీయూష్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హరిజవహర్ లాల్‌కు సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శిగా బాధ్యలు కట్టబెట్టారు.
Thanks for reading Transfer of IAS officers in AP
No comments:
Post a Comment