BP Sugar Medicines: రక్తపోటు, మధుమేహ వ్యాధి ఔషదాల ధర తగ్గింపు!
మరికొన్ని ఇతర మందులకూ వర్తింపు
ఎన్‌పీపీఏ తాజా నిర్ణయం
ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహ వ్యాధి, గుండె జబ్బులు, ఆస్తమా... తదితర వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ జబ్బులను అదుపులో పెట్టడానికి రోజూ మందులు వాడక తప్పదు. దీనికి ప్రజలు ఎంతో సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) తన 92వ అధికారిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఇవన్నీ తగ్గుతాయ్
విదాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్, ఎరిత్రోపోయటిన్ ఇంజెక్షన్, లెవిటిరాసెటమ్ ఇంజక్షన్, క్లోర్‌థలిడోన్, అమ్లోడిపిన్, టెల్మిసార్టాన్ ట్యాబ్లెట్, మెటోప్రోలాల్ సక్సినేట్, సిల్నిడిపిన్, రొసువాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ కేప్సూల్.. తదితర 23 రకాల ఔషధాల ధరలను సవరించినట్లు అయ్యింది.
ఈ ఔషధాలను ఉత్పత్తి చేసి దేశీయ మార్కెట్‌కు అందిస్తున్న ఔషధ కంపెనీల్లో... ఇప్కా ల్యాబ్స్, వోకార్డ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, లుపిన్, మైక్రో ల్యాబ్స్, క్యాడిలా హెల్త్‌కేర్, అరిస్టో ఫార్మా, విండ్లాస్ బయోటెక్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు మాస్కాట్ హెల్త్ సిరీస్‌తో కలిసి అరిస్టో ఫార్మా ఉత్పత్తి చేస్తున్న విదాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హైడ్రోక్లోరైడ్ (ఎస్‌ఆర్) ట్యాబ్లెట్‌కు తాజాగా రూ.6.86 ధరను ఎన్‌పీపీఏ నిర్ణయించింది. అదేవిధంగా వోకార్డ్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న ఎరిత్రోపోయటిన్ ఇంజెక్షన్ (20,000 ఐయూ, ఆర్-డీఎన్‌ఏ ఆరిజన్) ప్యాక్ ధరకు రూ.2,054 ధర ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ మందు ధర ఎంతో అధికంగా ఉంది. ఇప్కా ల్యాబ్స్‌కు చెందిన మెథోట్రెక్సేట్ టాపికల్ జెట్, సన్ ఫార్మా విక్రయిస్తున్న లెవిటిరాసెటమ్ సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్, డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన క్లోర్‌థలిడోన్, అమ్లోడిపిన్, టెల్మిసార్టాన్ ట్యాబ్లెట్, లుపిన్ ఔషధం మెటోప్రోలాల్ సక్సినేట్ తదితర ఔషధాలకు ఎన్‌పీపీఏ ధరలు నిర్ణయించింది.
Thanks for reading BP Sugar Medicines: Reducing the Price of Blood Pressure and Diabetes Medications!
No comments:
Post a Comment