Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 29, 2021

Alert for bank customers .. New Rules from October 1


 Bank Customers : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ .. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

Bank Customers : బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది.

వినియోగదారులను హ్యాకర్ల బారి నుంచి, ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం కోసం భద్రతా చర్యలు చేపడుతుంది. అందుకు అనుగుణంగా నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్యాంకింగ్‌, పెట్టుబడులు వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో ఆర్బీఐ పలు మార్పులు చేసింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆటో డెబిట్, పెన్షన్, చెక్ బుక్, మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్.. ఇలా అన్ని అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.


పెన్షన్‌..

80 ఏళ్లు పైబడినవారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే అక్టోబర్‌ 1 నుంచి డిజిటల్‌ ఫార్మాట్‌లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని హెడ్‌ పోస్టాఫీసుల్లో జీవన్‌ ప్రమాణ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.


ఆటో డెబిట్‌..

మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేలా ఏదైనా ఈఎంఐ లేదా ఇతర చెల్లింపులు ఉంటే మీకోసం ఈ అలెర్ట్. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ విధానంలో మార్పులు వస్తున్నాయి. ఇకపై మీ ఎకౌంట్ నుంచి ఏదైనా ఆటో డెబిట్ కావాలంటే మీ అనుమతి తప్పనిసరి. అంటే, మీరు ఏదైనా ఆటో చెల్లింపు కోసం బ్యాంకుకు ముందే సూచనలు ఇచ్చినప్పటికి.. అలా ఆటోమేటిక్ గా చెల్లింపు జరగాల్సిన ప్రతిసారీ మీరు మళ్ళీ బ్యాంకుకు మీ అనుమతి తప్పనిసరిగా చెప్పాలి. లేదంటే.. ఆ విధమైన చెల్లింపులు జరగవు. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే డెబిట్-క్రెడిట్ కార్డులపై అటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకునే కస్టమర్ల లావాదేవీలు విఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెల్లింపులు జరిగే 24 గంటలకు ముందు లావాదేవీలకు సంబంధించి సదరు బ్యాంకు వినియోగదారుడికి ఎస్ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించాలి. కస్టమర్‌ అనుమతిస్తేనే.. చెల్లింపులను పూర్తి చేయాలి.


Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు


పెట్టుబడులు..

అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్‌ స్థాయి ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని సెబీ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుంచి స్థూల వేతనంలో 10% వేతనాన్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.


చెక్‌ బుక్‌..

ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌కు సంబంధించి పాత చెక్కు బుక్కులు, ఎంఐసీఆర్‌ కోడ్స్‌ అక్టోబర్‌ 1 నుంచి చెల్లవు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు

Thanks for reading Alert for bank customers .. New Rules from October 1

No comments:

Post a Comment