స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో 3261 ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) - భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : రిసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్‌టైల్ డిజైనర్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 3261
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 - 1,60,000 /-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ): ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 1 గంట (60 నిమిషాలు) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ (టైపింగ్ / డేటా ఎంట్రీ / కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, మహిళలు, ex-ఆర్మీ ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 25, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 25, 2021
Thanks for reading Government Jobs in Staff Selection Commission || Qualification: 10th, Inter, Degree
No comments:
Post a Comment