Money transfer : ఇంటర్నెట్ లేకున్నా .. గూగుల్ పే , ఫోన్ పే , యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు .. ఎలాగో తెలుసా ?
డిజిటల్ యుగం వచ్చేసింది. రోజురోజుకూ కొత్తకొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పడు ఒకరికి డబ్బులు పంపించాలంటే.. బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది.
జియో వచ్చినప్పటి నుంచి డిజిటల్ రంగంలో చెల్లింపులు ఊపందుకున్నాయి. నోట్ల రద్దు తర్వాత పేటీఎం (Pay tm), గూగుల్‌పే (Google pay), ఫోన్ పే (Phone pay) తదితర యూపీఐ పేమెంట్స్ (UPI payments)ఎక్కువైపోయాయి. క్షణాల్లో నగదు బదిలీ (money transfer) చేసేస్తున్నారు. అయితే ఇదంతా ఆన్లైన్ (Online)లో ఉన్నంతకాలమే. ఒకవేళ అత్యవసరంగా ఎవరికైనా డబ్బులు పంపించాలి. ఆ సమయంలో ఆన్లైన్లో చెల్లింపులు చేస్తుండగా సడెన్‌గా ఇంటర్నెట్ అయిపోయిందనుకోండి.. ఏం చేస్తారు? ఏదైనా హోటల్లో, కంపెనీలో ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకున్నపుడు మొబైల్లో నెట్ లేకపోతే (No net) పరిస్థితేంటి. అప్పటికప్పుడు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాలంటే కష్టమే. అయితే మీలాంటి వారికోసమే.. ఇంటర్నెట్ లేకున్నా (Without Internet) నగదు బదిలీ (money transfer) చేసే అవకాశం ఒకటి ఉంది. మన మొబైల్ ఫోన్ నుంచే నెట్ లేకున్నా డిజిటల్ (digital) చెల్లింపులు చేసుకోవచ్చు. మీ ఫోన్ నుంచి *99# యూఎస్ఎస్డీ కోడ్ (USSD code) ద్వారా ఇది సాధ్యమవుతుంది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..
2012లోనే అందుబాటులోకి..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2012 నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్ (Smart phone) వినియోగదారులతో సహా మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ (Users)*99# సర్వీస్ భారతదేశం (India)లో ప్రవేశపెట్టారు. ఈ *99# సర్వీస్ అన్ని మొబైల్ యూజర్ల (mobile users)కు సేవలు అందించేందుకు పరిచయం చేశారు. మీరు ముందు.. BHIM యాప్ (App)ను డౌన్‌లోడ్ చేసుకొని, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిని అనుసరించి మీరు ఆఫ్‌లైన్ UPI బదిలీలను చేయగలరు. మీరు సరైన సిమ్ కార్డ్ , ఫోన్ నంబర్‌ను మీకు తగిన బ్యాంక్ ఖాతా (bank account)తో కనెక్ట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ ఉన్నా లేకున్నా ఈ సేవలు వినియోగించొచ్చు. కేవలం మీ వద్ద ఉన్న ఫోన్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాతో లింక్ (link) ఉంటే చాలు. *99# యూపీఐ సేవలను సులభంగా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ సేవలపై ఇప్పటికే అవగాహన ఉంటుంది.
కానీ, వేరే ఫోన్లు వాడే వారికి ఈ *99# ఒకటే ఆప్షన్. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ఇది అంతంగా పాపులర్ కాలేదు. ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం..
Step 1: మీ ఫోన్‌లో డయల్ ప్యాడ్ (dial pad) తెరిచి (*99#) అని టైప్ (type) చేయండి. ఇది మిమ్మల్ని ఏడు ఎంపికలతో కూడిన కొత్త విండోకి తీసుకెళుతుంది. విండోలో 'డబ్బు పంపండి (Money send)', 'డబ్బును స్వీకరించండి (Money receive)', 'చెక్ బ్యాలెన్స్ (check balance)', 'నా ప్రొఫైల్ (My profile)', 'పెండింగ్ అభ్యర్థనలు (Pending requests)', 'లావాదేవీలు (Transactions)' మరియు 'UPI పిన్ (pin)' వంటి ఎంపికల (Options) జాబితా చేస్తుంది.
Step 2: మీరు తదుపరి చేయాల్సిందల్లా మీ డయల్ ప్యాడ్‌పై నంబర్ 1 నొక్కడం ద్వారా 'డబ్బు పంపండి' ఎంపికను ఎంచుకోండి. ఇది మీ ఫోన్ నంబర్, UPI ID లేదా మీ ఖాతా నంబర్ మరియు IFSC కోడ్‌ని ఉపయోగించి డబ్బు పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Step 3: వివిధ రకాల చెల్లింపు పద్ధతుల్లో, మీరు ఒకదాన్ని ఎంచుకోవాలి, మీరు ఫోన్ నంబర్ ఎంపికను ఎంచుకుంటే.. మీరు డబ్బు పంపాలనుకునే వ్యక్తి యొక్క మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు UPI ID ఎంపికను ఎంచుకుంటే.. మీరు అవతలి వ్యక్తి యొక్క UPI ID ని నమోదు చేయాలి. బ్యాంక్ ఖాతా ఎంపికకు కూడా ఇది వర్తిస్తుంది.. ఇక్కడ IFSC కోడ్, తరువాత లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.
Step 4: తర్వాత, మీరు Google Pay లేదా Pay tm తో ఎలా చేసి ఉంటారో అదేవిధంగా, మీరు మరొక వ్యక్తికి బదిలీ చేయదలిచిన మొత్తాన్ని నమోదు చేయాలి.
Step 5: చివరి దశలో మీరు మీ ఆరు లేదా నాలుగు అంకెల UPI పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'పంపండి (Send)' బటన్ నొక్కాలి. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లో ఒక రిఫరెన్స్ (Reference) ID తో పాటు లావాదేవీ స్థితి అప్‌డేట్ (update)ను అందుకుంటారు. ఒకవేళ లావాదేవీ (Transaction) విజయవంతమైతే (Successful) భవిష్యత్తు లావాదేవీల కోసం మీరు ఈ వ్యక్తిని లబ్ధిదారుడిగా సేవ్ (save) చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు.
Thanks for reading Money transfer: Without internet .. Google Pay, Phone Pay, UPI payments can be made .. Do you know how?
No comments:
Post a Comment