Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 10, 2021

Government Teachers Frequently Asked Questions -Answers


Government Teachers Frequently Asked Questions - Answers



 సందేహాలు - సమాధానాలు


ప్రశ్న: మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్‌ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్‌ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్‌ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?

జవాబు: పింఛనులో బేసిక్‌, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్‌ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్‌ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్‌ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్‌ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్‌ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది.కమ్యుటేషన్‌ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు.ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.


ప్రశ్న: పెన్షనర్  మరనించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి??

జవాబు: పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.


ప్రశ్న: PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??

జవాబు: వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.


ప్రశ్న: స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??

జవాబు: ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.


ప్రశ్న: వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??

జవాబు: వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.


ప్రశ్న: భార్య & భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?

జవాబు:రూల్స్ ప్రకారం అలా వీలు లేదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏ విధమైన ఆదాయ వనరులు లేనప్పుడు మాత్రమే కారుణ్య నియామకం వీలుంటుంది.



 ప్రశ్న:  ఉపాధ్యాయుల వృత్తికి ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా? తెలుపగలరు.


జవాబు: ఏ ఉపాధ్యాయుడి పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా విధులకు ఆటంకం కలిగించినా దాడి చేసినా IPC186.189,353 ప్రకారం 2yr జైలు శిక్ష ఉంటుంది.



 ప్రశ్న: మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How to process


జవాబు: (1) ముందుగా మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి. (2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్ తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటిది సాధించవచ్చు కాని రెండవ దానికి గ్యారంటీ లేదు.



ప్రశ్న:  ఒక టీచర్ 22 days మెడికల్ లీవ్ లో ఉన్నాడు 23 rd day జనరల్ హాలిడే  ,24 th day సెకండ్ satur day ,25 th day sunday  ఇప్పుడు 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా? 23 రోజులకు తీసుకు రావాలా ? Prefix ,suffix మెడికల్ లీవ్ లకు వర్తిస్తాయా? GO లు తెలుపగలరు


జవాబు: ఈ కేసులో Fitness ఎప్పుడు పొందేరో ఇంపార్టెంట్.

(1) 22 రోజులకు Fitness Certificate ఇస్తే, 22-రోజులకు లీవ్ మరియు 3-రోజులకు suffix చేసుకోవచ్చు. 22-రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.

(2)25 రోజులకు Fitness Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.

FR 68; FR 71 మరియు AP Leave Rules ను చూడండి.

ప్రశ్న:సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

జవాబు:సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.



ప్రశ్న:స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

జవాబు:జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.


ప్రశ్న:ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

జవాబు:అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.


ప్రశ్న:LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

జవాబు:LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.


ప్రశ్న:విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??

జవాబు:విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు Dy. EO, 6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.


ప్రశ్న:నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??

జవాబు:ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.


ప్రశ్న:ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

జవాబు:చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.


ప్రశ్న:నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

జవాబు:జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.


ప్రశ్న:మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

జవాబు:చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.


ప్రశ్న: స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

జవాబు: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి


ప్రశ్న: ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని Els జమచేయబడతాయి??

జవాబు: వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.


ప్రశ్న: మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

జవాబు: సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.


ప్రశ్న:FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.


ప్రశ్న: నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.


ప్రశ్న: నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

జవాబు: SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.


ప్రశ్న: MA (Tel) MEd , PhD చేసినాను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ( తెలుగు ) గా పనిచేస్తున్నాను . Ph.D కి సంబంధించిన వివరములు సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయబడినవి . అయితే టీచర్ అటిండెన్సు రిజిస్టర్ లో  నాపేరుకు ముందు డాక్టర్ అని సంబోదించి  నేను నాపేరుకు ముందు డాక్టర్ పెట్టుకోకూడదా వివరములు తెలుపగలరు


సమాధానం: గౌరవ phd పట్టా ను పొందినారు కావున మీరు టీచర్ అటిండెన్సు రిజిస్టర్ లో  పేరుకు ముందు ఖచ్చితంగా డాక్టర్ ను పెట్టుకోవచ్చును.


ప్రశ్న: APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా?

సమాధానం: ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.


ప్రశ్న: ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి?

సమాధానం: జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.07.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.


ప్రశ్న: ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం: ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.


ప్రశ్న: ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??

సమాధానం: మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.


ప్రశ్న: నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా?

సమాధానం: పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.


ప్రశ్న: నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు?

సమాధానం: మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.


ప్రశ్న:నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు?

సమాధానం: జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.


ప్రశ్న: నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి?

సమాధానం :జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.


ప్రశ్న: నేను PF నుండి ఋణం పొందియున్నాను, వాయిదాలు పూర్తి కాలేదు, మరలా ఋణం కావాలి.ఇస్తారా?

సమాధానం: ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.


ప్రశ్న: ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?

సమాధానం: జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.


ప్రశ్న: భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?

సమాధానం: కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.


ప్రశ్న: సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.

సమాధానం: జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.


 ప్రశ్న: భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?

సమాధానం: కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.


 ప్రశ్న: సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.

సమాధానం: జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.


ప్రశ్న: నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?

సమాధానం: స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.


ప్రశ్న: డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు/ ఉద్యోగులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?

సమాధానం: AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.


ప్రశ్న: SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?

సమాధానం:అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.


ప్రశ్న: ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

సమాధానం: రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. sc/st/bc/oc కేటగిరీల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీకి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలకి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల  రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.



ప్రశ్న: నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?

సమాధానం: 24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.


ప్రశ్న: నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను.అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా?

సమాధానం: FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.


ప్రశ్న: ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు  ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?

సమాధానం: మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.


ప్రశ్న: నేను శనివారం, సోమవారం సెలవు పెట్టాలి.రెండు CL లెటర్లు ఇవ్వాలా?

సమాధానం: అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.


ప్రశ్న: నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి?

సమాధానం: సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.


ప్రశ్న: నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?

సమాధానం: జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.


ప్రశ్న: నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

సమాధానం: FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.


ప్రశ్న: డైస్ నాన్ కాలం అంటే ఏమిటి?

సమాధానం: FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.

FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.


ప్రశ్న: అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు. నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

సమాధానం: టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహించలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.


ప్రశ్న: నేను,నా భార్య ఇద్దరం టీచర్లం. హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?

సమాధానం: చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.


ప్రశ్న: GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా?

సమాధానం: ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.


ప్రశ్న: ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి?

సమాధానం: మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.


ప్రశ్న: ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

సమాధానం: Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.


ప్రశ్న: ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

సమాధానం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.


ప్రశ్న: ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

సమాధానం: మార్చి1 నుండి ఇవ్వాలి. AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.


ప్రశ్న:OD తర్వాత CL పెట్టవచ్చా?

సమాధానం:మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.


ప్రశ్న: మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్ అవకాశం ఉందా?

సమాధానం:RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.


ప్రశ్న: చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా?

సమాధానం:బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.


ప్రశ్న: వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు?

సమాధానం: మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.


ప్రశ్న: ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు?

సమాధానం: ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.


ప్రశ్న: వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??

సమాధానం: వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు


ప్రశ్న: సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??

సమాధానం: ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.


ప్రశ్న: ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??

సమాధానం: విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.


ప్రశ్న: Sir APGLI బాండ్లపై లోన్లు ఇవ్వటానికి ఏమైనా పథకం ఉన్నదా ? ఎప్పుడు, ఎలా లోన్ బాండ్ పై తీసుకోవచ్చు? తెలుపగలరు.

సమాధానం: APGLI  లో బాండ్స్ పై లోన్ ఏమి ఇవ్వరు. లోన్ ఫెసిలిటీ మాత్రం ఉంది.. APGLI  Loan will be sanctioned basing on the premiums paid. But not basing on the bond value (sum assured)


ప్ర: బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?

సమాధానం: ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులపై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన డిపాజిట్ ల పైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీలో టాక్స్ కట్ చేస్తారు. ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.


ప్రశ్న: అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా? హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సందర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది: 23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం.లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది: 20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు. వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం: ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది. 2000సం.లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.


ప్రశ్న: ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం,, స్కేలు, 24 సం,, స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి. అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?

సమాధానం: ఏ క్యాడర్ లో నైనా 18 సం,, స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు. 12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం,, ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది. SGT లు 24సం,, స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి. SA లకు తమ 12సం,, స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొంది వుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం,, వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు. పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.


ప్రశ్న: ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

సమాధానం: వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.


ఇంకా మరెన్నో సందేహాలు - సమాధానాలు కొరకు CLICK HERE

Thanks for reading Government Teachers Frequently Asked Questions -Answers

No comments:

Post a Comment