భవిష్యత్తులో మీకెంత డబ్బు అవసరం అవుతుంది?
దాన్ని ఎలా లెక్కించాలి? అంత డబ్బు ఎలా సంపాదించాలి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
40 ఏళ్ల క్రితం ఫోన్ ఉండటం పెద్ద లగ్జరీగా భావించేవారు. ఆ రోజుల్లో టీవీ ఉండటాన్ని కూడా గొప్పగానే చూసేవారు. 25ఏళ్ల క్రితం వరకు కూడా కారు అనేది ప్రభుత్వ ఉద్యోగులు, ధనవంతులకు మాత్రమే సొంతమనే భావన ఉండేది.
కానీ ఇప్పుడు నెలకు 50వేల కంటే తక్కువ సంపాదించే వారి ఇళ్లలో కూడా ఎల్‌సీడీ టీవీ, ఫ్రిడ్జీ, వాషింగ్ మెషీన్, ల్యాప్‌టాప్, బైక్ ఉంటున్నాయి. కొందరు కారు కూడా వాడుతున్నారు. 40 ఏళ్లతో పోలిస్తే జీవితం ఎంతో మారిపోయింది.
ఇక 50వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే వాళ్ల జీవితం వారి జీతానికి తగ్గట్టుగానే ఉంటోంది. దేశంలో ఎక్కువ మంది నెల జీతం 50వేల కంటే తక్కువే ఉంటుంది
మెజార్టీ ప్రజల సంపాదన నెలకు రూ.50,000 కంటే తక్కువే
దేశంలో ఎక్కువ శాతం మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. కార్మికులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి నెల జీతం సాధారణంగా రూ.50వేల లోపే ఉంటుంది.
ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు-సీబీడీటీ డేటా ప్రకారం 2018-19 సంవత్సరంలో కేవలం 5.87 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు.
అంటే ఈ డేటా ప్రకారం దేశంలో మెజార్టీ ప్రజలు ఆదాయ పన్ను పరిధిలో లేరని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లు నెలకు రూ. 50వేల లోపే సంపాదిస్తున్నారని అనుకోవచ్చు.
అంటే ఇప్పుడు నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న వ్యక్తి దగ్గర కోటి రూపాయలుంటే భవిష్యత్తులో సౌకర్యవంతంగా జీవించగలడా? భవిష్యత్తు కోసం అతనికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది? పెట్టుబడి మార్గలేమున్నాయి? ఇప్పుడు చూద్దాం.
ఒక వ్యక్తి జీవించడానికి ఇవాళ 50వేలు అవసరమైతే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది? 20, 30, 40, 50 ఏళ్ల తర్వాత అదే వ్యక్తికి ఎంత మనీ అవసరం అవుతుంది? ఈ కింది గ్రాఫ్‌లో చూడండి.
ఇవాళ నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న వ్యక్తికి సరిగ్గా ఇప్పటి జీవితమే 2040లో కావాలంటే అతనికి రూ.1.51 లక్షలు అవసరం పడొచ్చు. 2065 నాటికి నెలకు రూ.6,49,274 అతని దగ్గర ఉండాలి.
ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ద్రవ్యోల్బణం మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం ఇది .
2020లో భారత్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 6.6శాతమని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ మేము పైన చెప్పిన చార్ట్‌లో 6శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకున్నాం.
2008-2013 మధ్యకాలంలో భారత్‌లో ద్రవ్యోల్బణం 8.3శాతంగా ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనాలు చెబుతున్నాయి. సగటు ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతమని అనుకుందాం.
ద్రవ్యోల్బణం మన జీవితంపై అంత ఎక్కువగా ప్రభావం చూపుతుందా?
"ఇది తెలుసుకోవాలంటే మీ అమ్మమ్మ, తాతయ్యలను అడగండి. ఆ రోజుల్లో నిత్యావసర సరుకులు, బంగారం, ఇంటి అద్దెలు, ఇతర వస్తువుల ధరలు ఎంత ఉండేవో ఒకసారి వారిని అడగండి. అప్పుడు మీకు ధరలు ఎంత ఎక్కువగా పెరిగాయో అర్థమవుతుంది" .
మీరు ఎంతకాలం పనిచేస్తారు? ఎంతకాలం సంపాదిస్తారు?
అందుబాటులోకి వచ్చిన వైద్య సేవల కారణంగా ప్రజలు సగటున 75 సంవత్సరాల వరకు జీవించి ఉండొచ్చని . అనేక ప్రభుత్వ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి, 60 ఏళ్ల వరకు పని చేస్తాడనుకుందాం.
కానీ అప్పటి వరకు ఆయన ఉద్యోగం ఉంటుందా? ఎందుకంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటివి ఆయన ఉద్యోగంపై ప్రభావం చూపవా? ఒకవేళ ఆయన ఉద్యోగం చేస్తున్నా.. ముందుగా మనం లెక్కలేసుకున్న ద్రవ్యోల్బణం ప్రకారం ఆయన జీతం ఉంటుందా అన్నది ఇక్కడ మరో ప్రశ్న.
పోనీ.. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆయన జీతం కూడా పెరిగిందనే అనుకుందాం. 2021లో నెలకు రూ.50వేలతో జీవిస్తున్న వ్యక్తికి 2051లో నెలకు రూ.2.87 లక్షల రూపాయలు అవసరం అవుతాయి. అంటే అతనికి సంవత్సరానికి రూ.34.46 లక్షల రూపాయలు అవసరం అవుతాయి .
ఒక వ్యక్తి ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా తన జీవిత చరమాంకాన్ని ప్రశాంతంగా గడపాలంటే అతని దగ్గర ఎంత డబ్బుండాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి....
60ఏళ్ల వయసు వచ్చే నాటికి ఆయన దగ్గర రూ.3,90,50,000 ఉండాలి. ఈ డబ్బులను 8శాతం వార్షిక రాబడికి అవకాశం ఉన్న చోట పెట్టుబడి పెట్టాలి. అప్పుడు ఆయన మిగిలిన 15 సంవత్సరాల కాలాన్ని ప్రశాంతంగా గడపొచ్చు. కింద ఉన్న టేబుల్ చూడండి.
రిటైర్‌మెంట్‌కు ఒక సంవత్సరం ముందుగానే ఈ డబ్బు మీ చేతిలో ఉండాలి. అప్పుడు మీ ప్లాన్ ప్రకారం మీకు కావాల్సిన మొత్తాన్ని అందులోంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పండి.. ఒక కోటి రూపాయలు మీకు సరిపోతాయా? ఒక కోటితో మీరు ప్రశాంతంగా జీవించగలరా?
మరి దీనికి పరిష్కారం ఏమిటి ?
స్టాక్ మార్కెట్
ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
వివాహమై, పిల్లలు ఉన్నవారు ముందుగా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అనారోగ్యానికి గురైనప్పుడు మీరు పొదుపు చేసిన డబ్బు కరిగిపోకుండా ఇది కాపాడుతుంది.
ఆ తర్వాత కనీసం 200-300 గ్రాముల బంగారాన్ని చేతిలో ఉంచుకోండి. ఆపదలో బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు 2-3 నెలల జీతాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కం ప్లాన్‌లో పెట్టుబడి పెట్టండి. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా మీ ఉద్యోగం పోయినా మీ కుటుంబం అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. మరో ఉద్యోగం దొరికే వరకు మీకు డబ్బులకు ఇబ్బంది రాదు. గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు ఈ నిధి మీకు ఉపయోగపడుతుంది.
ఒకవేళ ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి కావాలంటే మాత్రం స్టాక్ మార్కెట్‌ను మించిన మరో మార్గం లేదు. ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5శాతం వడ్డీ కూడా ఇవ్వడం లేదు.
సుకన్య సంవృద్ధి యోజనలో కేంద్ర ప్రభుత్వం 7.6శాతం వడ్డీ ఇస్తోంది.
డెబిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో 10శాతాన్ని మించిన రాబడి కష్టమే. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి ఉంటుంది. కానీ ఇది చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఏ చిన్న పొరపాటు చేసినా మీ పెట్టుబడి మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
అందుకే వచ్చే 30 సంవత్సరాల కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. అవి సగటుగా 12 శాతం రాబడిని అందిస్తున్నాయి.
గడిచిన పదేళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ 13.8 శాతం వరకు రాబడిని ఇచ్చాయి.
అంటే నెలకు 11,250 రూపాయల చొప్పున 12శాతం వార్షిక రాబడి అందించే స్కీమ్‌లో ఎస్ఐపీ (SIP) పద్ధతిలో పెట్టుబడి పెడితే 30 సంవత్సరాల తర్వాత రూ.3.97 కోట్లు వస్తాయి.. ఇది ఒక అవగాహనకు మాత్రమే.
Thanks for reading How much money will you need in the future?
No comments:
Post a Comment