Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 11, 2021

Vaccination: The risk of death is 11 times lower if two doses are taken


 Vaccination: రెండు డోసులు తీసుకుంటే చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువ

అమెరికా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని అమెరికా అధ్యయనం వెల్లడించింది. అలాగే టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రచురించిన మూడు అధ్యయనాల్లో ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని వ్యాక్సిన్‌ మరింత ప్రభావవంతంగా తగ్గిస్తోందని అధ్యయనం తెలిపింది.


అధ్యయనం చేపట్టారిలా..

జూన్-ఆగస్టు నెలల్లో ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై అధ్యయనం చేసి సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. . అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు 86 శాతం ఆసుప్రతిలో చేరకుండా రక్షణ కల్పించాయి. కానీ, 75 ఏళ్లు దాటిన వారికి అది 76 శాతంగా పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. ఏదేమైనప్పటికీ  టీకాలు అధిక వయసు గలవారికి రక్షణ కల్పిస్తున్నాయని అధ్యయనంలో నిరూపితమైంది. ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చికిత్స తీసుకోవడం వంటి వాటి నుంచి 82 శాతం కంటే ఎక్కువ మందికి ఈ టీకాలు రక్షణ కల్పించాయి.

Thanks for reading Vaccination: The risk of death is 11 times lower if two doses are taken

No comments:

Post a Comment