IBM Recuritment : గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ కు మంచి అవకాశం ... ఐబీఎంలో జాబ్ ఆఫర్స్ ...
ఫ్రెషర్స్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. టెక్నాలజీ దిగ్గజం అయిన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (IBM) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల (entry level jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ (Associate System Engineer) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోర్సులు పూర్తి చేసి కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. అప్లికేషన్స్ రూపొదించడం, కోడ్స్ రాయడం, టెస్ట్ చేయడం, డీబగ్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లాంటివాటిపై ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.
IBM Entry Level Jobs: ఐబీఎంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల వివరాలివే...
విద్యార్హతలు- కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో బీఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు చదువుతుండాలి. ఎంట్రీలెవెల్ లేదా ఫ్రెషర్ జాబ్స్ కాబట్టి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఉండాల్సిన స్కిల్స్- ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ తెలిసి ఉండాలి. జావా, పైథాన్, Node.js లాంటి స్కిల్స్ ఉండాలి.
వర్క్ లొకేషన్- హైదరాబాద్, ముంబై, పూణె, ఢిల్లీ, గుర్గావ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్.
IBM Entry Level Jobs: దరఖాస్తు చేయండి ఇలా
Step 1- విద్యార్థులు ముందుగా https://www.ibm.com/in-en/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Careers సెక్షన్ క్లిక్ చేయాలి.
Step 3- Entry level / Intern ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
Step 4- అందులో కన్సల్టెంట్, డేటా సైంటిస్ట్, డిజైనర్, డెవలపర్, డిజిటల్ ప్రొఫెషనల్స్, సెల్లర్, టెక్నికల్ స్పెషలిస్ట్ లాంటి పోస్టులు కనిపిస్తాయి.
Step 5- మీరు అప్లై చేయాలనుకునే పోస్టు పైన క్లిక్ చేసిన తర్వాత Entry-level openings పైన క్లిక్ చేయాలి.
Step 6- ఆ తర్వాత ప్రాంతాల వారీగా పోస్టుల వివరాలు ఉంటాయి.
Step 7- పోస్టు సెలెక్ట్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
ఐబీఎం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది కాబట్టి ఫ్రెషర్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అనుభవం ఉన్నవారు ఇదే వెబ్‌సైట్‌లో IBM Careers India ట్యాబ్ పైన క్లిక్ చేసి ఇతర ఉద్యోగాల వివరాలు తెలుసుకోవచ్చు.
Thanks for reading IBM Recuritment: Good Opportunity for Graduate Fresher ... Job Offers at IBM ...
No comments:
Post a Comment