నేడే దుర్గాష్టమి .. దుర్గాష్టమి విశిష్టత పూజా విధానం !
ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులనూ దేవీ నవరాత్రులుగా ఎంతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు.ఈ నవరాత్రులలో భాగంగా చాలా మంది ఉపవాసాలతో అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటారు. ఇక నవరాత్రులలో భాగంగా చివరి మూడు రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా దుర్గాష్టమి మహా స్నానంతో మొదలవుతుంది. దుర్గాష్టమిను దేశ వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.
దుర్గాష్టమి రోజు అమ్మవారు చాముండి అవతారాన్ని పూజిస్తారు. చాముండి ఈరోజు మహిషాసురుడి రాక్షస సహచరులైన చండా, ముండా, రక్తబీజాలను అంతం చేస్తుందని నమ్ముతారు. ఎంతో పవిత్రమైన ఈ దుర్గాష్టమి రోజు చిన్నారులకు అమ్మవారి అలంకరణ వేసే సాక్షాత్తు చిన్నపిల్లలను కూడా అమ్మవారుగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పురాణాల ప్రకారం అష్టమి రోజు అమ్మవారు దుర్గం అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఆమెకు దుర్గామాతగ పేరుగాంచి భక్తులకు అష్టమి రోజు దర్శనమిస్తున్నారు.
పూర్వకాలంలో అష్టమి రోజు అమ్మవారికి జంతు బలి ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఈ ఆచరణ లేకపోవడంతో గుమ్మడి కాయ కొట్టడం, కొబ్బరి కాయకి పూజ చేయడం చేస్తుంటాము. దుర్గాష్టమి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కధంబం, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే.. మన శోకాలు పోతాయట. దుర్గామాతకు నేడు ఎరుపు రంగు పుష్పాలతో పూజించే ఎర్రటి వస్త్రాలను సమర్పించాలి. అష్టమి రోజు అమ్మవారు కాళీమాతగా కాలరాత్రి రూపంలో కూడా దర్శనమిస్తారు. పూజ అనంతరం దుర్గా మాత అష్టోత్తర మంత్రాలు తప్పకుండా చదవాలి
Thanks for reading Durgashtami: దుర్గాష్టమి విశిష్టత పూజా విధానం !
No comments:
Post a Comment