AP News: ఈ నెలాఖరుకు పీఆర్సీ కొలిక్కి: సజ్జల
అమరావతి: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ సమస్య ఈ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అడగక ముందే జగన్ ప్రభుత్వం ఐఆర్ ఇచ్చిందని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ, కరవు భత్యాల బకాయిల కోసం గళమెత్తిన ఉద్యోగ సంఘాలతో తాడేపల్లిలో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉంది. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆ కారణంగానే చిన్న చిన్న సమస్యలు. ఐఆర్ అమలులో కాస్త ఆలస్యం జరిగింది. వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. జీతాలు ఇటీవల ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయి. ఉద్యోగులను తన జట్టులో భాగంగా సీఎం భావిస్తారు’’ అని సజ్జల అన్నారు.
Thanks for reading AP News: PRC by the end of this month: Sajjala
No comments:
Post a Comment