Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 2, 2021

Online Shopping: Are you shopping online ..? It is better to take such precautions ..!


Online Shopping : మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా .. ? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది .. !

 Online Shopping: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ వచ్చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 2న సేల్ ప్రారంభం అయ్యింది.మరి ఈ సేల్‌లో మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో మంచిది. మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయడం మంచిది. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు ఎదురు చూడటం వృథానే.


డిస్కౌంట్‌ యాడ్స్‌ను చూసి నమ్మొద్దు..

మీరు నేరుగాసేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయడం బెటర్‌. ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్‌లపై కనిపిస్తున్న డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి. అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు. మీరు ధరలను చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు ధర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది.


ప్రస్తుతం డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌కే అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం అనేది సాధారణంగా మారిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్త అవకాశం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.


డిస్కౌంట్లు:

అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే లాభమే.

కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని ప్రోడక్ట్స్‌ అమెజాన్‌లో లభిస్తాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి. ఉదాహరణకు చెప్పాలంటే.. మీరు వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే పెద్దపెద్ద బ్రాండ్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయం గుర్తించుకోవాలి.


నకిలీ వెబ్‌సైట్లపై కన్నేయండి..

ఈ మధ్య కాలంలో నకిలీ వెబ్‌సైట్లు చాలా పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి వివిధ ఆఫర్ల అంటూ కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్స్‌ను చూపించి డెలివరి చేసే సమయంలో నాణ్యత లేకుండా నకిలీ వస్తువులను డెలివరి చేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. అందుకే ఏదైనా వస్తువులను ఆర్డర్‌ చేస్తే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తదితర మంచి పేరున్న సైట్ల నుంచి ఆర్డర్‌ చేస్తే మంచిది. అలాంటి వారు వస్తువుల్లో ఏదైనా పొరపాటు జరిగితే రిటన్‌ తీసుకుని క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. లేదా నాణ్యతమైన వస్తువులను అందిస్తారు.

వెబ్‌సైట్‌ కంపెనీ..

ఆకర్షణీయమైన బట్టలు లేదా ఇతర ప్రొడక్ట్స్‌ ఫోటోలు చూపిస్తూ సోషల్‌ మీడియాలో అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి వెబ్‌సైట్‌ యొక్క రిజిస్టర్‌ కార్యాలయం చిరునామా, ల్యాండ్‌లైన్‌ నెంబర్‌, ఇతర సమాచారారాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. ఏ కంపెనీ వెబ్‌ సైట్‌లోనైనా వారి పూర్తి సమాచారం కనిపించకపోతే అలాంటి సైట్‌ నుంచి షాపింగ్‌ చేయవద్దు.


క్యాష్‌ అన్‌ డెలివరీ :

ఇటీవల అనేక కొత్త కొత్త కంపెనీలు వివిధ పేర్లతో ఆన్‌లైన్‌ షాపింగ్‌లోకి దిగుతున్నాయి. ఇంటర్‌నెట్‌ ఆకర్షనీయమైన ఆపర్లతో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే అలాంటి వాటిని నమ్మడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాక.. ఆయా కంపెనీలు డెలివరీ చేయకుండా మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొత్త సైట్‌ల నుంచి ఏదైనా ఆర్డర్‌ చేస్తే క్యాష్‌ అండ్‌ డెలివరి (COD) ఆప్షన్‌ ఎంచుకుంటే మంచిది. ఒక వేళ వారు ఈ ఆప్షన్‌ ఇవ్వకపోతే అలాంటి సైట్ల జోకికి వెళ్లకపోవడం మంచిది.

వస్తువుల్లో నాణ్యత – వారంటీ:

డిస్కౌంట్లను చూసి అనేక మంది నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేసి మోసపోతుంటారు. దీంతో ఏదైనా వస్తువులను కొనే ముందు దాని రివ్యూలు, రేటింగ్‌లు చూడటం, దాని గురించి ఆన్‌లైన్‌లో వెతకడం మంచిది. తక్కువ ధర ఉంది కదా అని కొనుగోలు చేస్తే నాణ్యత లేకుండా ఉంటాయి. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో ఏసీ, టీవీ, ఫ్రిజ్‌, మైక్రోవేవ్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా వారంటీని చూడాలి. మంచి నాణ్యతతో ఎక్కువ కాలం వారంటీ అందించే వస్తువులనే కొనుగోలు చేయడం ఉత్తమం.

Thanks for reading Online Shopping: Are you shopping online ..? It is better to take such precautions ..!

No comments:

Post a Comment