NTPC Recruitment 2021 : ఇంజనీరింగ్ అభ్యర్థులకు అలర్ట్ .. NTPC లో రూ . 60 వేల వేతనంతో జాబ్స్ .. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది.
మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో (Contract Jobs) పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరఖాండ్ (Uttarakhand) లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 16న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
S.No. పోస్టు ఖాళీలు
1 మెకానికల్(Executive(Hydro) Mechanical) 5
2 సివిల్(Executive (Hydro) Civil) 10
మొత్తం: 15
విద్యార్హతల వివరాలు:
Executive(Hydro) Mechanical: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
Executive (Hydro) Civil: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా HRA/ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి.
వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు https://careers.ntpc.co.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: Current opening విభాగంలో 'Recruitment of experienced Mechanical & Civil engineers..' పేరుతో ప్రకటన ఉంటుంది. దాని కింద 'Click here to apply' లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: Functional Area ను ఎంచుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 4: జాబ్ టైటిల్, పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, జెండర్ విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 5: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PwBD/XSM కేటగిరీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Step 6: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
Thanks for reading NTPC Recruitment 2021: Alert for Engineering Candidates .. . Jobs with a salary of Rs 60 thousand .. Chance to apply a few more days
No comments:
Post a Comment