RESULTS - NATIONAL ELEGIBILITY CUM ENTRANCE TEST 2021 (NEET 2021)
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్‌టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్‌లకు ర్యాంక్ కార్డులను పంపింది.
720కి 720 మార్కులు సాధించింది వీరే..
తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా నీట్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in
http://taresults.nic.in/NTARESULTS&CMS/
వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్‌మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
Thanks for reading RESULTS - NATIONAL ELEGIBILITY CUM ENTRANCE TEST 2021 (NEET 2021)
No comments:
Post a Comment