Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 1, 2021

SBI New Facility .. Life Certificate by Video Call .. How to submit?


 ఎస్‌బీఐ కొత్త సదుపాయం.. వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌.. ఎలా సమర్పించాలంటే?

 పెన్షనర్లు ఏటా నవంబర్‌ 1 నుంచి లైఫ్‌ సర్టిఫికెట్‌ (జీవిత ధ్రువీకరణ పత్రం) సమర్పించాలి. పెన్షన్‌ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. ఖాతా ఉన్న బ్యాంకు, పోస్టాఫీసు, వారికి సంబంధించిన పెన్షన్‌ ఆఫీసు వద్ద గానీ లేదంటే జీవన్‌ ప్రమాణ్‌ పోర్టల్‌లో గానీ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇలా బ్యాంకు శాఖలను సందర్శించడం వృద్ధులకు కష్టంతో కూడుకున్న వ్యవహారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. తమ బ్యాంకులో ఖాతా ఉన్న పెన్షన్‌దారులకు వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే అవకాశం కల్పించింది. దేశంలోనే తొలిసారిగా వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ) సదుపాయాన్ని సోమవారం (నవంబర్‌ 1) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పింఛన్‌దారులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా వీడియో కాల్‌ చేసి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. దీనికి సంబంధించి నిమిషం నిడివి గల వీడియోను ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ దశలవారీ ప్రక్రియను వివరించింది.

సర్టిఫికెట్‌ సమర్పించండిలా..

* ఎస్‌బీఐ పెన్షన్‌ సేవా పోర్టల్‌ను సందర్శించండి.

* లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే ప్రక్రియను ప్రారంభించడానికి ‘వీడియో ఎల్‌సీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

* మీ ఎస్‌బీఐ పెన్షన్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.

* అనంతరం మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.

* నిబంధనలు, షరతులు చదివి అంగీకారం తెలిపి ‘స్టార్ట్‌ జర్నీ’పై క్లిక్‌ చేయండి.

* మీ ఒరిజినల్‌ పాన్‌ కార్డ్‌ను చేతిలో ఉంచుకుని ‘ఐ ఆమ్‌ రెడీ’పై క్లిక్‌చేయండి.

* వీడియో కాల్‌ ప్రారంభించడానికి మీరు అనుమతిచ్చిన తర్వాత ఎస్‌బీఐ అధికారి అందుబాటులోకి వచ్చి మీతో సంభాషిస్తారు.

* వీడియో కాల్‌లోకి వచ్చిన ఎస్‌బీఐ అధికారి మీ స్క్రీన్‌పై ఉన్న నాలుగంకెల ధ్రువీకరణ కోడ్‌ను చదవాలని అడుగుతారు. మీరు ఆ కోడ్‌ను చెప్పాల్సి ఉంటుంది.

* మీ పాన్‌ కార్డును బ్యాంక్‌ అధికారికి చూపించి, దాన్ని ఫొటో తీసుకోవడానికి అనుమతివ్వాలి. అనంతరం ఎస్‌బీఐ అధికారి మీ ఫొటోను తీసుకుంటారు.

* ఇంతటితో వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ) ప్రక్రియ పూర్తవుతుంది.

* ఒకవేళ ఏ కార‌ణంతోనైనా వీడియో లైఫ్ స‌ర్టిఫికేట్‌ ప్రక్రియ తిరస్కరణకు గురైతే ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆ విషయాన్ని బ్యాంకు మీకు తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయంగా మీకు పెన్షన్‌ చెల్లించే బ్యాంక్‌ శాఖను సందర్శించి లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేయొచ్చు.


Thanks for reading SBI New Facility .. Life Certificate by Video Call .. How to submit?

No comments:

Post a Comment