Bank Holidays in January 2022 :జనవరి లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే.....
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది రాబోయే సెలవుల జాబితాను ప్రకటించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు రాబోయే సెలవుల వివరాలను ఆర్‌బీఐ ప్రకటించింది.
హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు ఎన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో వెల్లడించింది. దేశంలోని అన్ని రీజియన్లలో సెలవుల (Bank Holidays) జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్‌బీఐ అప్‌డేట్ చేసింది. ఈ సెలవుల్లో పండుగలు, పర్వదినాలు ఇతర హాలిడేస్ కలిపే ఉన్నాయి. మరి మీరు తరచూ బ్యాంకులకు వెళ్తూ ఉంటే ఈ సెలవుల వివరాలు తెలుసుకొని మీ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. మరి 2022 లో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో, ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.
Bank Holidays 2022:
బ్యాంకులకు 2022 లో సెలవుల వివరాలు ఇవే
తేదీ సందర్భం
జనవరి 15 మకర సంక్రాంతి
జనవరి 26 రిపబ్లిక్ డే
మార్చి 1 మహా శివరాత్రి
మార్చి 18 హోళీ
ఏప్రిల్ 1 బ్యాంక్ అకౌంట్ల క్లోజింగ్ డే
ఏప్రిల్ 2 ఉగాది
ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి
ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే
మే 3 రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ
ఆగస్ట్ 9 మొహర్రం
ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే
ఆగస్ట్ 20 శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 31 వినాయక చవితి
అక్టోబర్ 5 దసరా
అక్టోబర్ 25 దీపావళి
నవంబర్ 8 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
బ్యాంకులకు 2022 లో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో వచ్చే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ప్రతీ నెలలో 6 లేదా 7 ఉంటాయి. కాబట్టి ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.
ఇక జనవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9 సెలవులు వచ్చాయి. జనవరిలో సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉంటాయి కాబట్టి సెలవులు ఎక్కువగానే ఉంటాయి. మరి జనవరిలో బ్యాంకులు ఏఏ రోజుల్లో తెరుచుకోవో తెలుసుకోండి.
Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలివే
జనవరి 2 ఆదివారం
జనవరి 8 రెండో శనివారం
జనవరి 9 ఆదివారం
జనవరి 15 మకర సంక్రాంతి
జనవరి 16 ఆదివారం
జనవరి 22 నాలుగో శనివారం
జనవరి 23 ఆదివారం
జనవరి 26 రిపబ్లిక్ డే
జనవరి 30 ఆదివారం
జనవరిలో తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు మొత్తం 9 సెలవులు ఉన్నాయి. వీటిలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు ఉన్నాయి. జనవరి 8, 9, జనవరి 15, 16, జనవరి 22, 23 తేదీల్లో బ్యాంకులకు వరుసగా రెండు సెలవులు రావడం విశేషం. కాబట్టి బ్యాంకు కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.
ఇతర రాష్ట్రాల్లో జనవరి 1 న్యూ ఇయర్, జనవరి 3 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, జనవరి 4 లోసూంగ్, జనవరి 11 మిషనరీ డే, జనవరి 12 స్వామి వివేకానంద జయంతి, జనవరి 14 పొంగల్, జనవరి 18 థాయ్ పూసమ్ సందర్భంగా వేర్వేరు రీజియన్లలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లో వర్తించవు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 26 రిపబ్లిక్ డే సెలవులు మాత్రమే ఉన్నాయి.
బ్యాంకుకు తరచూ వెళ్లేవారు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలు జరపాలి. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే సెలవులతో సందర్భం లేకుండా నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. జనవరితో పాటు ఇతర నెలల్లో హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల వివరాలు తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx చూడొచ్చు. హైదరాబాద్ రీజియన్ సెలెక్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల వివరాలు తెలుస్తాయి.
బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays in January 2022
No comments:
Post a Comment