Bank Jobs 2021: Good news for the unemployed .. Jobs in Union Bank .. Apply like this
ఇటీవల అనేక బ్యాంకులు (Banks) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేస్తూ ఉన్నాయి. తాజాగా ముంబాయి కేంద్రంగా పని చేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సినియర్ ఎగ్జిక్యూటీవ్/డొమైన్ ఎక్స్పెర్ట్స్ విభాగంలో నియామకలు చపట్టనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తుకు చివరి తేదీగా 29.12.21 ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, హెడ్ అనలిటిక్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. హెడ్-ఏపీఐ మేనేజ్మెంట్, హెడ్-డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు ఖాళీలు
చీఫ్ రిస్క్ ఆఫీసర్ 01
చీఫ్ డిజిటల్ ఆఫీసర్ 01
హెడ్ అనలిటిక్స్ 01
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 01
హెడ్ ఏపీఐ మేనేజ్మెంట్ 01
హెడ్ డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్ 01
మొత్తం 06
విద్యార్హతల వివరాలు: వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. బీటెక్/బీఈ, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు ముందుగా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ (https://www.unionbankofindia.co.in/english/home.aspx) ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత మీకు Click here to view current Recruitmentపై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత Click here for Notification, Click here to Apply Online అనే రెండు ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. తర్వాత Click here to Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం Registration Now! ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తు చేయాలనుకున్న పోస్టు, పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 6: దీంతో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ వివరాలతో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Step 7: దరఖాస్తు అనంతరం భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
Thanks for reading Bank Jobs 2021: Good news for the unemployed .. Jobs in Union Bank .. Apply like this
No comments:
Post a Comment