RBI Rules : వినియోగదారులు అలర్ట్ .. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు .. !
RBI Rules: గత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ ఏడాదిలో కొన్ని నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, గ్యాస్ సిలిండర్ తదితర అంశాలపై పలు మార్పులు జరగనున్నాయి.
ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే కస్టమర్లకు చార్జీల భారం పడనుంది. మరి ఈ ఏడాదిలో ప్రజలపై ఎలాంటి భారం పడనుందో చూద్దాం.
బ్యాంకు లాకర్స్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్స్ నిబంధనలు మార్చింది. ఈ నిబంధనల గురించి ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు నెలలోనే వెల్లడించింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి మారిన లాకర్స్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. లాకర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి బ్యాంకులు వాటి బోర్డు ఆమోదంతో సొంత పాలసీని కలిగి ఉండాలని రిజర్వ్ బ్యాంకు తెలిపింది.
ఆర్బీఐ సవరించిన రూల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఆర్బీఐ నిబంధనల మేరకు బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్రాంచ్‌లో ఏయే లాకర్లు ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని తెలుపాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌లోని వస్తువులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకులు తెలిపేందుకు ఎలాంటి వీలు లేదని ఆర్బీఐ తెలిపింది. ఏదైనా నిర్లక్ష్యం కారణంగా లాకర్లో ఉన్న వస్తువులు పోయినట్లయితే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ విధించిన నిబంధనల్లో ఉంది.
ఏటీఎం చార్జీలు:
జనవరి 1 నుంచి ఏటీఎం చార్జీలు మోత మోగనున్నాయి. ఆర్బీఐ జూన్ నెలలో బ్యాంకులు ఏటీఎం చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదిలో ఏటీఎం విత్‌డ్రాపై చార్జీలు విధించనుంది. ఇంటర్‌ఛేంజ్ ఫీజు నేపథ్యంలో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగించేందుకుఏటీఎం క్యాష్ విత్‌డ్రా చార్జీలను విధించింది. పరిమితికి మించి విత్‌డ్రా చేస్తే ఇక నుంచి చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ చార్జీలు రూ.21 వరకు పెంచుకోవచ్చని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
ఓలా, ఉబెర్ బుకింగ్‌పై..
ఓలా, ఉబెర్ వంటి సంస్థల నుంచి బైకు, లేదా కారు బుకింగ్ చేసుకుంటే అదనపు భారం పడనుంది. కేంద్ర సర్కార్ ట్యాక్స్ బుకింగ్ సర్వీసులకు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చింది. 5 శాతం వరకు జీఎస్టీ పడనుంది. ఈ అదనపు భారం ఆన్‌లైన్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది.
ఫుడ్ డెలివరీ సంస్థలపై జీఎస్టీ:
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి సంస్థలపై కూడా జీఎస్టీ భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జనవరి 1 నుంచి జీఎస్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ ప్రభావం కస్టమర్లపై పడబోదు. ఇవి రెస్టారెంట్ల నుంచి జీఎస్‌టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది వరకు కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు వసూలు చేస్తున్న జీఎస్టీలో కొంత ఫుడ్ డెలివరి సంస్థలకు వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ జీఎస్టీ రెస్టారెంట్లకు కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లనుంది.
గ్యాస్ ధరలు:
ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి చమురు సంస్థలు. ప్రతి నెల మాదిరిగానే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మారే అవకాశం ఉంది. ఈ నెల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
హీరో మోటోకార్ప్ బైక్ ధరల పెంపు:
హీరో మోటొకార్ప్‌కు సంబంధించిన ద్విచక్ర వాహనాల ధరలు జనవరి 4 నుంచి పెరగనున్నాయి. ఇప్పటి ధరలను పెంచనున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. బైక్‌లు, స్కూటర్లు ఎక్స్‌షోరూమ్ ధరపై రూ.2వేలకుపైగా పెరగనుంది.
Thanks for reading RBI Rules: Consumers Alert ..New Rules from January 1 ..!
No comments:
Post a Comment