Today AP:Covid-19 Media bulletin
31.01.22
30.01.22
29.01.22
28.01.22
27.01.22
26.01.22
25.01.22
24.01.22
23.01.22
22.01.22
కరోనా వైరస్ కేసులు ఏపీలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా.. 43,763 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 12,926 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
వైరస్ బారి నుంచి..మరో 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. 73 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.దేశంలో వరుసగా మూడు లక్షల కేసులు నమోదువుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3, 37, 704 మంది రోగాన బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.
ఒమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. నిన్న వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కేసులతో మొత్తం రోగుల సంఖ్య పదివేల ఐదు వందలకు చేరుకుంది.
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలని 3.69 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి 21, 13, 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం 5.43శాతంగా ఉంది. రికవరీ రేటు 93.31 శాతం.
మహారాష్ట్రలో 144కేసులు వెలుగు చూశాయి. కొత్తంగా 48, 270 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరవై నాలుగు గంటల్లో ఆ రాష్ట్రంలో యాభై రెండు మంది చనిపోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే రోగుల సంఖ్య రెండు వేల డభ్బై మూడు మంది కొత్తగా చేరినట్టు తెలుస్తోంది.
కేరళలో యాభై నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులోని వారంతా యూఏఈ నుంచి వచ్చిన వారిగా గుర్తించి ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కూడా జోరుగా సాగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో అరవై ఏడు లక్షల మందికి టీకా వేసినట్టు పేర్కొంది. మరో డబ్భై నాలుగు లక్షల మందికి ప్రికాషన్ డోస్ ఇచ్చినట్టు తెలిపింది.
మరోవైపు ఈ మధ్య కరోనా వచ్చిన తగ్గిన వాళ్లకు ప్రికాషన్ డోస్ మూడు నెలల తర్వాత వేయాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
21.01.22
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా..కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,942 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో 1,585, అనంతపురంలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులో నమోదయ్యాయి.
20.01.22
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… కరోనా థర్డ్ క్రమ క్రమంగా విజృంభిస్తోంది. రోజుకు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 12000 కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 12615 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2140056 కి పెరిగింది. కోవిడ్ వల్ల విశాఖపట్నం లో ముగ్గురు,చిత్తూరు మరియు నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14527 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53871 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3,674 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2071658 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 47,420 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,20,12,102 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
19.01.22
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది . ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి . గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి . కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు , చిత్తూరు , గుంటూరు , | నెల్లూరు , శ్రీకాకుళం , విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు . కరోనా బారి నుంచి నిన్న 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది . అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827 , చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి .
18.01.22
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి . ఒక్కరోజే 7 వేలకు చేరువలో కొవిడ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది . గడచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి . కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ఇద్దరు , చిత్తూరులో ఒకరు , నెల్లూరులో ఒకరు మృతి చెందారు . కరోనా బారి నుంచి నిన్న 1,066 మంది పూర్తిగా కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది . చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 1,534 కేసులు నమోదయ్యాయి .
17.01.22
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి . గడచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ... కొత్తగా 4,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది . కరోనా బారి నుంచి నిన్న 696 మంది కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది .
16.01.22
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి . గడచిన 24 గంటల్లో 30,022 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 4,570 కరోనా కేసులు నమోదయ్యాయి . కొవిడ్ వల్ల నిన్న చిత్తూరులో ఒకరు మరణించారు . కరోనా బారి నుంచి నిన్న 669 మంది పూర్తిగా కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది .
15.01.22
AP లో రికార్డు స్థాయిలో కేసులు AP : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా .. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి . ఒకరు కోవిడ్తో మరణించారు . మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు . ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి . రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది . నిన్నటి కంటే 400 పై చిలుకు కేసులు నమోదయ్యాయి .
13.01.22
12.01.22
11.01.22
10.01.22
09.01.22
అమరావతి : రోజు రోజుకీ ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . తాజాగా 38,479 శాంపిల్స్ను పరీక్షించగా , 1,257 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది . దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,774 కు చేరింది . తాజాగా కరోనాతో బాధపడుతూ గుంటూరు , విశాఖలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు . గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కరోనా కేసులు నమోదు కాగా , విశాఖలో 196 , అనంతపురంలో 138 , కృష్ణాలో 117 , గుంటూరులో 104 కేసులు నమోదయ్యాయి . ఇక 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు .
08.01.22
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ లో 840 కేసులు నమోదవ్వగా.. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో 839 కొత్తకేసులు బయటపడ్డాయి.రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,553 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. వారిలో 839 మందికి కరోనా నిర్థారణ అయింది. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, విశాఖలో 174 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.ఇక ఇదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 14,503కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,80,602 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,62,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3,659 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా వివిధ ఆస్పత్రుల్లో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
07.01.22
06.01.22
05.01.22
04.01.22
03.01.22
02.01.22
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 24,219 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న నెల్లూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 130 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,260 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
01.01.22
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,717 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి నిన్న 103 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
Thanks for reading Today AP:Covid-19 Media bulletin
No comments:
Post a Comment