Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 24, 2022

Here are some tips to help you lose weight without exercising.


 వ్యాయామం చేయకున్నా బరువును తగ్గించే చిట్కాలివిగో ..

ఇది నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా.. ఇది నూటికి నూరు పాల్లూ నిజం.. వెయిట్ లాస్ అవ్వడానికి ఇక నుంచి మీరు గంటల తరబడి ఎక్సర్ సైజెస్ చేయక్కర్లేదు..

సులభంగా ఉండే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు ఈజీగా బరువు తగ్గుతారు.

ప్రస్తుత కాలంలో అధిక బరువు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. దీని నుంచి తొందరగా బయటపడటానికి వీరంతా అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. స్పెషల్ డైట్ ను పాటిస్తూ, గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. ఇవి వెయిట్ లాస్ ప్రాసెస్ ను చాలా సులభతరం చేస్తాయి కూడా. అయితే నిత్యం వ్యాయామం చేయాలంటే మాత్రం కష్టమనే చెప్పాలి.

 


ఎందుకంటే వ్యాయామాలకు గంటల సమయం కేటాయించాలి. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ వంటి అలిసిపోయే పనులను చేయాల్సి ఉంటుంది. వీటిని చేయడం వల్ల పెద్దమొత్తంలో శరీరం శక్తిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి తిప్పలేమీ పడకుండా ఈజీగా బరువు తగ్గే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ.. బరువు తగ్గండి.

బ్లాక్ కాఫీ: వెయిట్ తగ్గేందుకు బ్లాక్ కాఫీ ఎంతో సహాయపడుతుంది. కానీ దీనిలో షుగర్ ను అస్సలు యాడ్ చేయకూడదు. బ్లాక్ కాఫీకి 60 శాతం కేలరీలు షుగర్ కంటెంట్ వల్లే వచ్చి చేరుతాయి. కాబట్టి బ్లాక్ కాఫీలో షుగర్ ను కలుపుకోకుండా తగితే సులభంగా మీరు వారానికి 500 కేలరీలు బర్న్ చేస్తారు. ఈ బ్లాక్ కాఫీకి షుగర్ ను యాడ్ చేయకపోతే డయాబెటిస్, ఇన్సులిన్ తో పాటుగా జీవక్రియకు సంబంధించిన సమస్యను కూడా తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.

ఆరోగ్య కరమైన చిరుతిళ్లు: సాయంత్రం వేలల్లో నచ్చినది తినాలని కోరిక పుడుతూ ఉంటుంది. దాంతో చాలా మంది పాకెట్ ఫుడ్స్ తెచ్చుకుని తింటూ ఉంటారు. వీటిని తినడం మరింత బరువు పెరిగే ప్రమాదముంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండండి. వీటికి బదులుగా సీజనల్ ఫ్రూట్స్ ను తినండి. లేదంటే గ్రీన్ టీ తాగండి. వీటితో మీ కోరికా తీరుతుంది. అలాగే వెయిట్ కూడా తగ్గుతారు.

కంటినిండా నిద్ర: వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో నిద్ర ఎంతో ముఖ్యం. రోజుకు దాదాపుగా 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇలా నిద్రపోతేనే శరీరం తన విధులను సక్రమంగా చేయగలుగుతుంది. ఒకవేళ మీరు కంటినిండా నిద్రపోకపోతే గ్రెలిన్ వంటి హార్లోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. దాంతో మీకు ఎక్కువగా ఆకలివేస్తుంది. ఇంకేముంది కడుపు నిండా లాగిస్తారు. దీంతో మీరు వెయిట్ పెరుగుతారు. కాబట్టి ప్రతిరోజూ కంటినిండా నిద్రపోండి.

తగినంత నీరు: సులభంగా బరువు తగ్గాలంటే ప్రతిరోజూ ఖచ్చితంగా 8 గ్లాసుల నీటిని తాగాలి. ముఖ్యంగా డీహైడ్రేట్ బారిన పడకుండా చూసకోవాలి. ఎందుకంటే శరీరంలో తగినంత నీరు లేకపోతే శరీరం ఉబ్బిపోతుంది. అలాగే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. శరీరానికి సరిపడా నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలన్నీ బయటకు పంపబడతాయి. అంతేకాదు ఇది జీర్ణవ్యవస్థను కూడా క్లీన్ చేస్తుంది.

Avoid canned foods: తక్కువ కేలరీలు, షుగర్ ఫ్రీ ఫుడ్స్ మీకు బాగా నచ్చొచ్చు. కానీ ఇవిమీకు ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారిస్తుంది. బరువు తగ్గడానికి కాదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు చాలా ఫాస్ట్ గా ఆకలిగా అనిపిస్తుంది. అంతేకాదు మీ బరువు తగ్గే ప్రాసెస్ కూడా నిదానంగా మారుతుంది మరి.

(Disclaimer: The information given in this article is based on general assumptions. tlmweb.in does not confirm the same. Please contact the relevant expert before implementing them)

Thanks for reading Here are some tips to help you lose weight without exercising.

No comments:

Post a Comment