Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 17, 2022

Baba Atomic Research Center (BARC) Recruitment


 Baba Atomic Research Center (BARC) Recruitment: బార్క్‌లో 266 పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బాబా అట‌మిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) పరిధిలోని న్యూక్లియర్‌ రీసైకిల్‌ బోర్డుల్లో (తారాపూర్‌, కల్పకం) కింది పోస్టుల భ‌ర్తీకి దర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 266

1) స్టైపెండ‌రీ ట్రెయినీలు కేట‌గిరీ-1: 71 పోస్టులు

విభాగాలు: కెమిస్ట్రీ, కెమిక‌ల్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్‌.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

స్టైఫెండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.18000 చెల్లిస్తారు.

2) స్టైపెండ‌రీ ట్రెయినీలు కేట‌గిరి-2: 189 పోస్టులు

ట్రేడులు: ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, ప్లాంట్‌ ఆపరేటర్‌ తదితరాలు.

అర్హ‌త‌: కెమిక‌ల్ ప్లాంట్ ఆప‌రేట‌ర్ పోస్టులకు క‌నీసం 60% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్, మిగ‌తా పోస్టుల‌కు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

స్టైఫండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

3) సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి (సేఫ్టీ): 01

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత. 

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.35400 చెల్లిస్తారు.

4) టెక్నీషియ‌న్‌-బి (లైబ్రరీ సైన్స్‌): 01 

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత, లైబ్రరీ సైన్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 

వ‌య‌సు: ‌ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.

5) టెక్నీషియన్‌-బి (రిగ్గర్‌): 04 

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత, రిగ్గర్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 

వ‌య‌సు: ‌ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసేనాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21700 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం:  01.04.2022.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.04.2022.


NOTIFICATION Here

APPLY Here

WEBSITE Here 

Thanks for reading Baba Atomic Research Center (BARC) Recruitment

No comments:

Post a Comment