Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 26, 2022

TSPSC: First Group-1 notification released in Telangana!


 TSPSC : తెలంగాణలో తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ వచ్చేసింది !

హైదరాబాద్‌: తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. తెలంగాణ యువత ఎన్నాళ్లగానో వేచి చూస్తోన్న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చేసింది.

నిన్న పోలీస్‌ శాఖలో 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ ఈరోజు 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే తొలి గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ కావడం విశేషం.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు జరపాలని నిర్ణయించారు. కాగా, ప్రిలిమ్స్‌ పరీక్ష జులై లేదా ఆగస్టు నెలలో, మెయిన్స్‌ పరీక్ష నవంబరు లేదా డిసెంబరు నెలలో జరిగేందుకు అవకాశాలున్నట్లు నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 సర్వీసెస్‌లో తొలిసారి ఈడబ్ల్యూఎస్‌, స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.


Notification Here

Thanks for reading TSPSC: First Group-1 notification released in Telangana!

No comments:

Post a Comment