Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 23, 2022

Ammavodi @2022 Latest Update


 Ammavodi @2022 Latest Update

★గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రాసెస్

 ★పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలున్నా ఓకే

 రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి 'జగనన్న అమ్మఒడి' నిధు లు జూన్ 21న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. అందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్లో పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు లబ్ధిదారుల అర్హతలు ఉన్నాయా లేదా అనేవి సేకరిస్తున్నారు. అమ్మఒడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం హాజరు వివరాలు) మాత్రమే అందించనుంది. మరోవైపు లబ్ధిదారులు నివాసాల్లో కరెంట్ బిల్లులు 300 యూనిట్లు దాటాయా లేదా అనే వివరాలతోపాటు, వారికి ఉన్న రేషన్ కార్డు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మఒడిలబ్దిదారుల జాబితాలకు సం బంధించిన మూడు జాబితాలను గ్రామ, వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవర ణలకూ ఒక దరఖాస్తు రూపొందిం చినమోదు చేస్తున్నారు.


దరఖాస్తుల ద్వారా వివరాల సేకరణ..

అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేనికి సంబంధించిన వారు, జిల్లా, మండలం, విద్యార్థి చదువుతున్న స్కూల్ వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్ధులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్, తల్లి, సంరక్షకుల పేరు, ఆధార్లతోపాటు విద్యార్థుల ఆధార్, స్కూల్ యూడైన్ కోడ్, బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు.


పోస్టల్ బ్యాంకు ఖాతాలకూ..

అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తు న్నారు. దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలున్నా వాటిలో జమ చేయాలని ప్రభు త్వం నిర్ణయిం చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల చేశారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాలు జీరో అకౌంట్లు కావడంతో లబ్ధిదారులు ఎలాంటి కనీస మొత్తం లేకుండా ఖాతాలు తెరిచి, ఉపయోగిం చుకోవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే రెగ్యులర్ బ్యాం కుల్లో ఏ విధంగా వివిధ రకాల నగదు జమ చేస్తారో.. ఆసౌకర్యాలన్నీ పోస్ట్బ్యంకులో కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఈ సదుపాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

అమ్మఒడి పథకం పైన HMs కు ఒక  అవగాహన.

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడగలరు.

జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

జాబితా-2:(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన  Grievance format  లో submit చేయాలి.

జాబితా-3:(Re confirmation/re verification required)  ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి

మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది.

ఇందులో 

1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II &  List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II &  List-III  లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ &  ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో  అందజేయాలి.


★అమ్మఒడి పథకం కోసం తల్లుల e Kyc కోసం ప్రాథమిక జాబితాలు విడుదల, ఆన్లైన్ లో e KYC చేసే పూర్తి విధానం

★అమ్మఒడి 2022 FAQ's సందేహాలు -సమాధానాలు click Here👈

★అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు ౼Amma Vodi Grievance Form Click Here

2022 పథకానికి అర్హులా కాదా అని ఆన్లైన్ చెక్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,  అమ్మఒడి eKyc లో రాని పేర్లు అర్హులా కాదా ,ఏ కారణం చేత In Eligible అయ్యారో ఇలా చెక్ చెక్ చేయవచ్చును. Watch Below వీడియో






Thanks for reading Ammavodi @2022 Latest Update

No comments:

Post a Comment