Personal Loan: లోన్ తీసుకునేవారికి అలర్ట్ ... గూగుల్ కొత్త రూల్స్
1. ఒకప్పుడు పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం... ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది.
2. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే 10 నిమిషాల్లో కూడా రుణాలు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ఇక ఇటీవల పర్సనల్ లోన్ యాప్స్ కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల కన్నా వేగంగా పర్సనల్ లోన్ యాప్స్ లోన్స్ ఇస్తున్నాయి.
3. పర్సనల్ లోన్ యాప్స్ ఉపయోగించడం సులువుగా ఉండటం, అప్రూవల్ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుండటంతో ఖాతాదారులు బ్యాంకుల్లో కాకుండా ఇలాంటి యాప్స్‌లో లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ లోన్ యాప్స్ అనేక దారుణాలకు కారణం అవుతున్నట్టు వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది.
4. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకున్న ఖాతాదారులు వేధింపులు ఎదుర్కొన్న ఘటనలు అనేకం బయటపడ్డాయి. రుణగ్రహీత స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్నింటినీ సేకరించే లోన్ యాప్స్, రుణాలు చెల్లించని వారి వివరాలను సదరు కాంటాక్ట్స్‌కి షేర్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా రుణాలు మంజూరు చేస్తున్న పద్ధతిపైనా వివాదాలు ఉన్నాయి.
5. ఇక ఇంకొన్ని యాప్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి లేకుండానే యాప్స్ ద్వారా రుణాలు ఇస్తున్నాయి. ఈఎంఐలు చెల్లించనివారిని వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల్ని గుర్తించిన Google... భారతదేశంలోని పర్సనల్ యాప్ అర్హతలు, అవసరాలకు సంబంధించి అదనపు రుజువును సమర్పించాలని కోరింది.
6. కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఈ యాప్‌లకు గడువు విధించింది. "మీరు వ్యక్తిగత రుణాలను అందించడానికి RBI ద్వారా లైసెన్స్ పొందినట్లయితే, మా రివ్యూ కోసం తప్పనిసరిగా లైసెన్స్ కాపీని సమర్పించాలి" అని Google బ్లాగ్‌పోస్ట్ ద్వారా వెల్లడించింది. కాబట్టి సదరు పర్సనల్ లోన్ యాప్స్ తప్పనిసరిగా ఆర్‌బీఐ ఇచ్చిన లైసెన్స్ కాపీని Google కి సమర్పించాల్సిందే.
7. మరో విషయం ఏంటంటే ఇలాంటి యాప్స్ నేరుగా రుణాలు ఇచ్చే కార్యకలాపాల్లో ఉండకూడదు. కేవలం రుణాలు పొందే సదుపాయాన్ని సులభతరం చేసే ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉండాలి. అంటే బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే పర్సనల్ లోన్స్ సులువుగా పొందడానికి ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే పనిచేయాలి.
8. యూజర్లు కూడా ఇలాంటి పర్సనల్ లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. Google ప్లే స్టోర్‌లో కనిపించే ఇలాంటి యాప్స్‌లో రుణాలకు దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ పర్సనల్ లోన్ యాప్‌కు ఆర్‌బీఐ లైసెన్స్ ఉందో లేదో చెక్ చేయాలి. బ్యాంకులు నిర్వహించే యాప్స్ ద్వారా రుణాలు తీసుకుంటే సమస్య ఉండదు.
Thanks for reading Personal Loan: Alert for borrowers ... Google New Rules
No comments:
Post a Comment