Bank Holidays In July 2022
జులై నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది. కొన్ని పర్వదినాలు ఉండటంతో ఈసారి బ్యాంకులకు 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.
ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.
బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. ప్రాంతాలను బట్టి జులైలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
ఆదివారం కాబట్టి జులై 3, 10, 17, 24, 31న వారాంతపు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారం కాబట్టి జులై 9, 23న సెలవులు.
రథ యాత్ర, ఖార్చి పూ, బక్రీద్, ఈదుల్ అజా, భాను జయంతి, బెహెదీన్‌ఖామ్, హరేలా, కెర్ పూజా సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో జులై 1, 7, 9, 11, 13, 14, 16, 26న సెలవులు ఉన్నాయి.
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays In July 2022
No comments:
Post a Comment