Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 25, 2022

New Labor codes: Work only 4 days a week .. Reduced pay .. New rules from July 1 ..!


New Labour codes : వారానికి 4 రోజులే పని .. తగ్గనున్న వేతనం .. జులై 1 నుంచి కొత్త రూల్స్ .. !

  కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు (New Labour codes) జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలను రూపొందించాయి. ఇప్పటికే కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి వాటిలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటో చూద్దాం..!

4 రోజులే పని..

కొత్త చట్టాల ప్రకారం.. రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది. అంటే ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటల పాటు పనిచేయాలని కంపెనీ ఉద్యోగులను కోరవచ్చు. ఈ లెక్కన వారంలో మూడు వీక్లీ ఆఫ్‌లు వస్తాయి. అయితే, వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారంలో ఒక వీక్లీ ఆఫ్‌ మాత్రమే వస్తుంది.

చేతికొచ్చే వేతనం తగ్గుతుంది..

కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. మొత్తం శాలరీలో బేసిక్‌ శాలరీ సగం ఉండాలి. అంటే అలవెన్సులు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్‌ పెరిగినప్పుడు ఆ మేర పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. అయితే, రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే మొత్తంతో పాటు, గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారి శాలరీలో ఎక్కువ శాతం అలవెన్సులే ఉంటాయి. కొత్త చట్టాలు అమలైతే ఆ మేరకు చేతికొచ్చే వేతనం తగ్గుతుంది.

సెలవుల్లోనూ మార్పు..

ఉద్యోగికి ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పూ ఉండబోదు. అలాగే, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత లీవులు పొందొచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటాకే సెలవులు వస్తున్నాయి. అయితే, జులై 1 నుంచి ఈ చట్టాలను అమలు చేయాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. కానీ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి నియమ, నిబంధనలను రూపొందించాయి. ఈ చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంటుంది.

Thanks for reading New Labor codes: Work only 4 days a week .. Reduced pay .. New rules from July 1 ..!

No comments:

Post a Comment