Indain Railways : మీరు రిజర్వ్ చేసుకున్న సీటుని వేరొకరు ఆక్రమించారా ? గొడవపడకుండా ఇలా చేస్తే ఆల్ సెట్ .. !
Indian Railways: చాలా ప్రయాణికులు.. దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తే ట్రైన్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ట్రైన్ ప్రయాణం ఈజీ, కంఫర్ట్‌గా ఉండటం, ఛార్జీలు కూడా తక్కువగా ఉండటమే అందుకు కారణం.
అయితే, దూర ప్రయాణాలు చేయాల్సివస్తే.. ప్రయాణికులు ఖచ్చితంగా సీట్లను రిజర్వ్ చేసుకుంటారు. ఆ రిజర్వేషన్ ప్రకారం కేటాయించిన సీట్లలో ప్రయాణికులు కూర్చుంటారు. అయితే, కొన్నికొన్ని సార్లు.. ఒకరు రిజర్వు చేసుకున్న సీట్లలో మరొకరు కూర్చుంటారు. రిజర్వ్‌డ్ సీట్ అని చెప్పినా పట్టించుకోరు. పైగా వాదనలకు దిగుతుంటారు. సీట్ షేర్ చేసుకుందాం అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు. మొత్తానికి ఇలా ఘర్షణలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే, ఇలా ఘటనలను దృష్టిలో పెట్టుకునే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్‌లో ప్రయాణికుల ఎలాంటి ఘర్షణలు జరుగకుండా, ఎవరూ బెదిరింపులకు పాల్పడకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చింది. రిజర్వ్ చేసుకున్న సీటును ఎవరూ బలవంతంగా లాగేసుకుండా.. ప్రొటెక్ట్ చేస్తుంది.
కంప్లైంట్ ఇవ్వండి..
రైళ్లలో సీట్లను ఆక్రమించుకోవడం అనే రచ్చ మన దేశంలో కొత్తేం కాదు. తరచూ ఇలాంటి ఘటనలు రైళ్లలో జరుగుతూనే ఉంటాయి. టికెట్ రిజర్వ్ చేసుకోని ప్రయాణీకులు కొంతమంది సెకండ్ క్లాస్, స్లీపర్, AC క్లాస్ వరకు అన్నీ తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ కూర్చుంటారు. అయితే, ఎవరైనా మీ రిజర్వ్ సీటులో కూర్చుంటే.. వెంటనే టీటీఈ కి కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే 'రైల్వే మదద్'లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదు ఎలా చేయాలి?
1. మీ రిజర్వ్ సీటును ఆక్రమించి.. తిరిగి వాగ్వాదానికి దిగినట్లయితే.. రైల్వే మదద్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. (https://railmadad.indianrailways.gov.in) లింక్‌పై క్లిక్ చేయవచ్చు.
2. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. ఆ తర్వాత, Send OTPపై క్లిక్ చేయాలి.
4. మీ మొబైల్‌లో వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
5. మీ టికెట్ బుకింగ్ PNR నంబర్‌ను నమోదు చేయాలి.
6. టైప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీ కంప్లైంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
7. ఘటన జరిగిన తేదీని సెలక్ట్ చేసుకోవాలి.
8. కంప్లైంట్‌ను వివరింగా కూడా రాయొచ్చు.
9. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
139కి కూడా ఫిర్యాదు చేయొచ్చు..
ట్రైన్‌లో ఎవరైనా రిజర్వ్‌డ్ సీటును ఆక్రమించినట్లయితే.. మొదట ఆ విషయాన్ని రైలులోని టీటీఈకి తెలియజేయాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో కంప్లంట్ ఇవ్వలేకపోతే.. రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు
Thanks for reading Indian Railways: Your reserved seat taken by someone? Here`s how to remove them without fighting
No comments:
Post a Comment