Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 24, 2022

Monkeypox: కరోనా జాగ్రత్తలే మంకీపాక్స్‌కు విరుగుడు!


 Monkeypox: కరోనా జాగ్రత్తలే మంకీపాక్స్‌కు విరుగుడు!

దిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆదివారం దిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి కరోనా (corona virus)  తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. దిల్లీలోని ప్రముఖ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రి వైద్యుడు డా.సురేశ్‌ కుమార్‌ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.సురేశ్‌ సూచించారు. విదేశీ ప్రయాణాలు చేసినవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవ అని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా (global health emergency) ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది.

Thanks for reading Monkeypox: కరోనా జాగ్రత్తలే మంకీపాక్స్‌కు విరుగుడు!

No comments:

Post a Comment