Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 29, 2022

Kidney Patients: కిడ్నీలకు నచ్చే ఆహారం ఏంటో తెలుసా..!


 Kidney Patients: కిడ్నీలకు నచ్చే ఆహారం ఏంటో తెలుసా..!

 కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైనవి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు వ్యర్థాలను బయటకు పంపించే యంత్రమిది. దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యతో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తుంది. మనం తీసుకునే ఆహారం, నీటితోనే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలకు నచ్చే ఆహార నియమాల గురించి ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ జి.శశిధర్‌ వివరించారు.

ఇలా చేసి చూడండి

* రకరకాల కిడ్నీ జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. కొంతమందికి కిడ్నీల్లో రాళ్లు కూడా ఉంటాయి. కొంతమందికి ప్రోటీన్లు పోవడంతో పాటు రక్తకణాలు వెళ్తుంటాయి. మరికొంతమంది డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తుంది. 

* సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఉప్పు చాలా వరకు తగ్గించాలి. మాంసకృత్తులు తక్కువగా తీసుకోవాలి. నీటిని లీటరు కంటే ఎక్కువగా తీసుకోవాలి. సముద్ర ఉప్పును కొంతవరకు వాడుకోవచ్చు.

* టమాట, పాలకూరతో కొంతమందికి రాళ్లు వస్తాయి. అనుమానిత లక్షణాలున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి.

* రోజువారీ వంటల్లో అల్లం, పసుపు తప్పనిసరిగా వాడుకోవాలి. కొత్తిమీరకు రక్తనాళాల్లో ఆటంకాలను నిలువరించే శక్తి ఉంటుంది. 

* పెరుగు, బెర్రీ పండ్లు, బీన్స్‌, గుమ్మడి విత్తనాలు, నువ్వులు కిడ్నీలకు మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

* వంటల్లో ఆలీవ్‌ నూనెను వాడుకుంటే మేలు చేస్తుంది. 

* డయాలసిస్‌కు వెళ్లినవారు.. సాధారణ వ్యక్తుల కంటే 20-30 శాతం ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి. 

* కిడ్నీల మార్పిడి జరిగిన వారు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

* కారం, మసాలాలను బాగా తగ్గించుకోవాలి. అధిక మసాలాలు కాలేయం, కిడ్నీలను ఇబ్బంది పెడుతాయి. 

* సిగరెట్‌ను పూర్తిగా మానేయాలి. ఇందులో కాడ్మియం అనే మెటల్‌ ఉంటుంది. అది కిడ్నీల లైనింగ్‌లో పేరుకొని పోతుంది. కాఫీ, టీ తగ్గించాలి. పెయిన్‌ కిల్లర్లు అధికంగా వాడొద్దు.

Thanks for reading Kidney Patients: కిడ్నీలకు నచ్చే ఆహారం ఏంటో తెలుసా..!

No comments:

Post a Comment