Minority Scholarships: మైనారిటీ విద్యార్థులకు ఉపకారం
* ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ స్కాలర్‌షిప్ ప్రకటన విడుదల
దేశ వ్యాప్తంగా మైనార్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలు అందించేందుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రకటన వెలువడింది. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకునేముందుగానే అర్హతలు పరిశీలించుకోవాలని సూచించింది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తరువాత అందులో మార్పులకు అవకాశం ఉండదని వెల్లడించింది. గత ఏడాది ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు ఆ ఉపకార దరఖాస్తు ఐడీతో ఈ ఏడాదికి రెన్యువల్ చేసుకోవాలని కోరింది.
వివరాలు...
1. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
2. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
3. మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్
అర్హతలు:
* ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్ (పార్సీ) అల్ప సంఖ్యాక వర్గాల విద్యార్థులు అర్హులు.
* ప్రీమెట్రిక్ విభాగంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ/ ఎంఫిల్ వరకు, మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్న మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ వార్షికాదాయం: ప్రీమెట్రిక్ విభాగానికి రూ.లక్ష, పోస్ట్ మెట్రిక్ విభాగానికి రూ.రెండు లక్షలు, ఎంసీఎంబీ విభాగానికి రూ.2.5 లక్షలలోపు ఉండాలి.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తు చివరి తేది: సెప్టెంబరు 30
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తు చివరి తేది: అక్టోబరు 31
మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ చివరి తేది: నవంబర్ 15
Thanks for reading Minority Scholarships: మైనారిటీ విద్యార్థులకు ఉపకారం
No comments:
Post a Comment