Reliance Jio : ఇండిపెండెన్స్ డే కానుకగా జియో అదిరిపోయే ఆఫర్లు ..
స్వాతంత్య్ర(Independence) దినోత్సవం సందర్భంగా తమ యూజర్లకు స్పెషల్ ఆఫర్ అందిస్తున్నట్లు ప్రకటించింది టెలికాం నెట్‌వర్క్ రిలయన్స్ జియో (Reliance Jio).
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'ఇండిపెండెన్స్ డే 2022' ఆఫర్‌ను జియో ప్రకటించింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ టెలికాం ఆపరేటర్.. తాజా ప్లాన్‌తో కస్టమర్ల(Customer)కు రూ.3,000 విలువైన ప్రయోజనాలతో పాటు ఏడాది వరకు వ్యాలిడిటీ అందిస్తోంది. ఈ కొత్త ప్లాన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక ట్విట్టర్(Twitter) హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 'జియో అందిస్తున్న రూ. 2999 ఇండిపెండెన్స్ ఆఫర్‌తో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రెట్ చేసుకోండి.. రూ. 3000 విలువైన ఉచిత ప్రయోజనాలను ఆస్వాదించండి' అని రిలయన్స్ జియో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
ఇండిపెండెన్స్ డే 2022 ప్లాన్ బెనిఫిట్స్
ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ. 2,999 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు రోజుకు 100 SMSలతో పాటు 2.5GB రోజువారీ డేటా పొందుతారు. రోజువారీ డేటా యూసేజ్ లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. కొత్త ప్లాన్‌తో ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకునే జియో యూజర్లకు రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించనుంది. వారు JioTV, JioCinema, JioSecurity, JioCloud
ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో జియో సూట్‌కి యాక్సెస్ పొందుతారు.
ఇతర ప్రయోజనాలు..
75GB అదనపు డేటా
1 సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్
రూ. 750 విలువైన Ajio కూపన్
నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు
Ixigoపై రూ. 750 తగ్గింపు
ఇతర యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్స్
కొత్తగా ప్రారంభించిన రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ కాకుండా, రిలయన్స్ జియో ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రూ.2,879, రూ.2,545 ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. రూ.2,879 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS లతో పాటు జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ పొందవచ్చు. రిలయన్స్ జియో రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, 1.5 GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలతో పాటు జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ లభిస్తుంది.
Thanks for reading Reliance Jio: Jio's amazing offers for Independence Day
No comments:
Post a Comment